Gurpatwant Singh: అటువంటి వారు కెనడాను వీడండి.. వేర్పాటువాది బెదిరింపు
న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సిక్కు వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: కెనడా- భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ (Canada India relations).. నిషేధిత సంస్థలకు చెందిన నేతల బెదిరింపు ప్రకటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సిక్కు వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెనడాలో నివసిస్తున్న హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది.
‘కెనడా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోన్న కొంతమంది ఇండో- హిందువులు.. కెనడా పట్ల నిబద్ధతను చాటడం లేదు. కెనడా నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ.. భారత్‌కు మద్దతు పలుకుతున్నారు. ఏ దేశ ప్రయోజనాలు, రక్షణ కోసం ఆసక్తి చూపుతున్నారో అటువంటి వారు తిరిగి భారత్‌కు వెళ్లాలి’ అని గురుపత్వంత్ పన్నూ చెబుతున్నట్లు ఓ వీడియో వైరల్‌గా మారింది. హర్దీప్సింగ్ నిజ్జర్ మృతిని కొందరు వేడుక చేసుకున్నారని ఆరోపించిన అతడు.. ఖలిస్థానీ వ్యతిరేక శక్తులకు కెనడాలో చోటు లేదన్నాడు. ఇలా పన్నూ బెదిరింపులపై కెనడాలో హిందూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఏంటీ ఖలిస్థాన్ వేర్పాటువాదం.. ఎలా పురుడు పోసుకుంది?
సిఖ్ ఫర్ జస్టిస్ (SFJ) అనే వేర్పాటువాద సంస్థను భారత్ 2019లోనే నిషేధించింది. 2007లో ఈ సంస్థను స్థాపించగా.. వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్ను కూడా ఒకడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. తాజాగా కెనడాలో జరుగుతోన్న పరిణామాలపై పన్నూ స్పందించాడు. కెనడా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇండో- కెనడియన్ హిందువులు వ్యవహరిస్తున్నారని ఆరోపించిన అతడు.. అటువంటి వారు తిరిగి భారత్ వెళ్లిపోవాలని బెదిరించాడు.
ఈ బెదిరింపులు ఆందోళనకరం..
కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ.. హిందువులపై బెదిరింపులకు పాల్పడటంపై అధికార పార్టీ సభ్యులే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో దేశంలోని హిందువులను లక్ష్యంగా చేసుకోవడంపై అధికార పార్టీ చట్టసభ సభ్యుడు చంద్ర ఆర్య విస్మయం వ్యక్తం చేశారు. ఈ తరహా దాడులతో హిందూ కెనడియన్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు తనకు తెలిసిందన్నారు. ఇటువంటి సమయంలో సంయమనంతో ఉండాలని కెనడా హిందువులకు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Iraq: ఇరాక్‌లో బాంబు దాడి.. 10 మంది మృతి
ఇరాక్‌లోని దియాలా ప్రావిన్స్‌లో స్థానిక ఎంపీ బంధువులపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా.. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
రామస్వామి అభ్యర్థిత్వానికి ఎదురుదెబ్బలు
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో దిగేందుకు రిపబ్లికన్ పార్టీ నామినేషను కోసం పోటీపడుతున్న భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి (38)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
భూతాపంలో 2023 కొత్త రికార్డు
వాతావరణ రికార్డుల్లో 2023 అత్యుష్ణ సంవత్సరంగా నిలిచిపోనుందని ఐక్యరాజ్య సమితికి అనుబంధమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గురువారం తెలిపింది. -
చర్చల ప్రసక్తే లేదన్న ఉత్తర కొరియా
తాము ఇటీవల నిర్వహించిన గూఢచారి ఉపగ్రహ ప్రయోగాన్ని అమెరికా ఖండించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడి సోదరి కిమ్ యో జాంగ్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్, జ్యూరిచ్
ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయని ‘ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ (ఈఐయూ) తెలిపింది. -
97కు చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణను గురువారం ఉదయం మరో రోజుకు పొడిగించారు. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉంది. -
అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ మృతి
ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్(100) బుధవారం కనెక్టికట్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. -
మొదటి నుంచీ అదే చెబుతున్నాం
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నిన భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడంద్వారా మేం చెబుతున్న వాదనలకు బలం చేకూరిందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యానించారు. -
తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు
తూర్పు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్ ప్రాంతంపై గురువారం రష్యా ఎస్-300 క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. -
ఓస్ప్రేల నిలిపివేత!
అమెరికా వైమానిక దళానికి చెందిన ఓస్ప్రే విమానం సాగర జలాల్లో కూలిపోయిన నేపథ్యంలో జపాన్ పునరాలోచనలో పడింది. తన వద్ద ఉన్న ఇదే తరహా విమానాల కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేయాలని భావిస్తోంది. -
‘మరింత అణుశక్తి కావాలి’
వాతావరణ మార్పులపై పోరాటానికి మరింత అణుశక్తి కావాల్సి ఉందని, పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు ఇది ఎంతో ముఖ్యమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ మారియానా గ్రాసీ పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
-
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
-
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
-
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు