Biden: దౌత్యమార్గంపై ఆశలు సజీవం..

ఉక్రెయిన్‌ సంక్షోభం పరిష్కారానికి దౌత్యమార్గాలు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అభిప్రాయపడ్డారు.

Published : 15 Feb 2022 12:49 IST

  అగ్రదేశాధినేతల అభిప్రాయం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి దౌత్యమార్గాలు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అభిప్రాయపడ్డారు. వీరు నేడు 40 నిమిషాలపాటు ఫోన్‌కాల్‌లో మాట్లాడుకొన్నారు. రష్యా ఇప్పటికే దాదాపు 1,00,000 మందికిపైగా సైనికులను ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మోహరించింది. దీంతో దాదాపు డజనుకుపైగా దేశాలు ఉక్రెయిన్‌ నుంచి తమ ప్రజలను వెనక్కి రావాలని కోరాయి.

రష్యా- ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి దళాల విరమణకు అవసరమైన దౌత్యానికి కొన్ని కీలక మార్గాలే మిగిలి ఉన్నాయన్నట్లు బైడెన్‌తో ఫోన్‌కాల్‌ సందర్భంగా జాన్సన్‌  పేర్కొన్నట్లు బ్రిటన్‌ ప్రధాని కార్యాలయమైన డౌనింగ్‌ స్ట్రీట్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్‌పై జరిపే ఏ చొరబాట్లైనా రష్యాలో సుదీర్ఘ సంక్షోభానికి దారితీస్తుందని నేతలు పేర్కొన్నట్లు ఆ ప్రకటనలో వివరించారు.

ఈ సందర్భంగా అమెరికా తీసుకొనే చర్యలకు సాయం చేయడానికి బ్రిటన్‌ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలపగా.. ‘‘మీరు లేకుండా మేం ఎక్కడికీ వెళ్లం మిత్రమా’’ అని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని