Joe Biden: స్టేజీ మధ్యలో బిగుసుకుపోయిన బైడెన్‌.. చేయందించి బయటకు తీసుకెళ్లిన ఒబామా!

Joe Biden: బైడెన్‌ వయోభార సమస్యలతో బాధపడుతున్నట్లు పలుసార్లు ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. తాజాగా చోటుచేసుకున్న ఓ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Published : 18 Jun 2024 09:23 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) ఆరోగ్యం, వయోభార సమస్యల గురించి తరచూ చర్చ జరుగుతోంది. పలుసార్లు ఆయన వింతగా ప్రవర్తించడమే అందుకు కారణం. దారితప్పడం, గందగరోళ చూపులు, స్టేజీపై ఆగిపోవడం వంటి ఉదంతాలు అందుకు ఉదాహరణ. తాజాగా మరోసారి అదే తరహా ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆయనకు సాయంగా నిలిచారు.

లాస్‌ ఏంజిల్స్‌లో శనివారం డెమోక్రాటిక్‌ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. దీంట్లో బైడెన్‌ (Biden), ఒబామా కలిసి పాల్గొన్నారు. వారిద్దరినీ జిమ్మీ కిమ్మెల్‌ దాదాపు 45 నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేశారు. అనంతరం మద్దతుదారులు కరతాళ ధ్వనులతో హాల్‌ను మార్మోగించారు. దీంతో ఇరువురు నేతలు వారికి అభివాదం చేశారు. అనంతరం ఒబామా స్టేజీ దిగి వెళ్లేందుకు సిద్ధమై ముందుకు కదిలారు. బైడెన్‌ మాత్రం ఎటూ పాలుపోనట్లు ఓ పది సెకన్ల పాటు ఉన్నచోటే బిగుసుకుపోయినట్లు నిలబడిపోయారు. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఒబామా.. బైడెన్‌ను చేయి పట్టి అక్కడి నుంచి తీసుకెళ్లారు.

అణు విద్యుత్తులోనూ చైనా దూకుడు

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. బైడెన్‌ (Joe Biden) ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ మాత్రం అధ్యక్షుడి ఆరోగ్యం బాగానే ఉందని ఇటీవల ఓ సందర్భంలో వివరణ ఇచ్చారు. 81 ఏళ్ల వయసులో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని