NATO: మాడ్రిడ్‌కు బయల్దేరిన నాటో దేశాధినేతలు..!

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అత్యంత కీలకమైన నాటో దేశాధినేతల సమావేశం మంగళవారం నుంచి  స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఉక్రయిన్‌కు మద్దతు

Updated : 28 Jun 2022 20:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అత్యంత కీలకమైన నాటో దేశాధినేతల సమావేశం మంగళవారం నుంచి  స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ఉక్రయిన్‌కు మద్దతు, కూటమి విస్తరణ వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈ భేటీకి ఒక రోజు ముందు నాటో సెక్రటరీ జనరల్‌ జేన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ మాట్లాడుతూ కూటమిలోని దేశాలన్ని అప్రమత్తంగా ఉండటంతో చురుగ్గా దళాల సంఖ్యను 40 వేల నుంచి 3లక్షలకు పైగా పెంచే అవకాశం ఉందన్నారు. కోల్డ్‌వార్‌ తర్వాత తమ సమష్టి రక్షణలో చేస్తున్న అతిపెద్ద పునర్‌ వ్యవస్థీకరణగా పేర్కొన్నారు.

మాడ్రిడ్‌లో జరగనున్న సమావేశంలో ఉక్రెయిన్‌కు ఆర్థిక, సైనిక సాయాలను పెంచడం, తూర్పు ఐరోపాలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుంది. రష్యా నుంచి పెరుగుతున్న ముప్పు, చైనా  ప్రాబల్యం  వేగంగా విస్తరించడంతో జరిగే పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి స్వీడన్‌, ఫిన్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణ కొరియా నేతలు కూడా హాజరవుతున్నారు. స్వీడన్‌, ఫిన్లాండ్‌లు ఇప్పటికే నాటో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకొన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని