Joe Biden: దేవుడు దిగి వచ్చి చెబితే.. బైడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తాను వైదొలిగేదే లేదని జో బైడెన్‌ పునరుద్ఘాటించారు. ట్రంప్‌తో డిబేట్‌ సమయంలో అస్వస్థతకు గురైనట్లు తెలిపారు.

Updated : 06 Jul 2024 18:42 IST

వాషింగ్టన్‌: రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌తో జరిగిన డిబేట్‌ సమయంలో అస్వస్థతగా ఉండటంతోనే తడబడ్డానని అమెరికా (USA) అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) వెల్లడించారు. అధ్యక్ష పదవి రేసు నుంచి తనను దేవుడు మాత్రమే తొలగించగలడని పేర్కొన్నారు. నవంబరు 5న జరిగే ఎన్నికల్లో  విజయం ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. ఓ టెలివిజన్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జూన్‌ 27న ట్రంప్‌ (Donald Trump)తో జరిగిన డిబేట్‌లో బైడన్‌ తడబడటంతో అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతలే డిమాండ్‌ చేస్తున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. వీటిని బైడెన్‌ తోసిపుచ్చారు. ప్రధాన డెమోక్రటిక్‌ పార్టీ నాయకులు ఎవరూ వైదొలగమని చెప్పలేదన్నారు. ‘దేవుడు పై నుంచి వచ్చి జో నువ్వు రేసు నుంచి వెళ్లిపో’ అని అడిగితే తాను రేసు నుంచి వెళ్లిపోతానన్నారు. చర్చలో జరిగిన తప్పిదాలను బైడెన్‌ అంగీకరించారు. తనకు అస్వస్థతగా ఉన్నందునే చర్చలో సరిగా స్పందించలేదన్నారు.

‘‘విదేశీ నాయకులు, జాతీయ భద్రతా మండలి అధికారులతో చర్చించాలంటే ముందుగా సన్నద్ధమయ్యేవాడిని. చర్చ సమయంలో జరిగిన పొరపాట్లకు పూర్తి బాధ్యత నాదే. ఆ సమయంలో కాస్త అస్వస్థతకు గురయ్యా. ఇక, డిబేట్‌లో ట్రంప్‌ 28 సార్లు అబద్ధాలు చెప్పారు’’ అని తెలిపారు. ‘‘నేను ప్రచారం మాత్రమే చేయడం లేదు ప్రపంచాన్ని నడుపుతున్నాను. అది అతిశయోక్తిలా అనిపించినప్పటికీ అదే నిజం’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని