
Biden Vs Putin: పుతిన్‌కు క్షమాపణ చెప్పను : జో బైడెన్
అధికార మార్పు తమ విధానం కాదన్న అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతోన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై చేసిన వ్యాఖ్యలపై తాను వెనక్కి వెళ్లడం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉద్ఘాటించారు. ఈ విషయంలో పుతిన్‌కు ఎటువంటి క్షమాపణలు చెప్పనని స్పష్టం చేశారు. పుతిన్ అధికారంలో కొనసాగకూడదని చేసిన వ్యాఖ్య కేవలం ‘నైతిక ఆగ్రహమే’నని.. రష్యాలో అధికార మార్పు తమ విధానం కాదన్నారు. వ్లాదిమిర్ పుతిన్ ఓ కసాయి, అధికారంలో కొనసాగకూడదంటూ బైడెన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతోన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఈ విధంగా స్పందించారు. అయితే, ఈ అంశంపై అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్‌హౌస్’ ఇప్పటికే నష్టనివారణ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.
‘నేను చేసిన వ్యాఖ్యల పట్ల వెనక్కి వెళ్లడం లేదు. వాస్తవం ఏంటంటే.. ఉక్రెయిన్‌లో రష్యన్ సేనల క్రూరత్వం, అక్కడి చిన్నారుల పరిస్థితి, ఆ కుటుంబాలతో కలిసిన తర్వాత వారిపై పుతిన్ వ్యవహరిస్తున్న తీరుపై నాకు కలిగిన అభిప్రాయాన్ని ఆగ్రహంగా వ్యక్తం చేశాను. అంతేకాని అది అమెరికా విధానం మాత్రం కాదు. అక్కడి పరిస్థితులను చూసిన తర్వాత వేదనతో అలా స్పందించాను. అందుకు నేను క్షమాపణలు చెప్పను’ అని వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జో బైడెన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌లో మారణహోమాన్ని కొనసాగించడానికి పుతిన్ చేస్తున్న ప్రయత్నాలను వివరించిన ఆయన.. పుతిన్ ప్రవర్తిస్తున్న తీరును చూసి యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోతోందన్నారు. అయినప్పటికీ రష్యాలో పాలనా మార్పు మాత్రం అమెరికా విధానం కాదని జోబైడెన్ మరోసారి స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే, సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతోన్న దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఇటీవల ఐరోపాలో పర్యటించారు. అందులో భాగంగా పోలండ్‌లోని ఉక్రెయిన్ శరణార్థుల శిబిరాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన బైడెన్.. ఆ దారుణ పరిస్థితులకు కారణమైన పుతిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు ఓ కసాయి అని, ఆయన ఎంతమాత్రం అధికారంలో కొనసాగవద్దంటూ వ్యాఖ్యానించారు. అయితే, బైడెన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన క్రెమ్లిన్.. తమ అధ్యక్షుడిని రష్యా ప్రజలే ఎన్నుకుంటారంటూ స్పందించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యాలు వివాదాస్పదం కావడంతో నష్టనివారణ చర్యలు చేపట్టిన వైట్‌హౌస్.. పుతిన్ ప్రభుత్వాన్ని కూల్చాలనే యోచన తమకు లేదని ప్రకటించింది. ఇదే సమయంలో జో బైడెన్ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mohammed Zubair: ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ అరెస్ట్
-
Business News
Credit cards: క్రెడిట్ కార్డులను తెగ వాడేస్తున్నారు.. ఈ కామర్సుల్లోనే ఎక్కువ!
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
COVID cases: తెలంగాణలో భారీగా కొవిడ్ కేసులు.. హైదరాబాద్‌లో ఎన్నంటే?
-
Politics News
Andhra News: సొంత పార్టీ నేతలే నాపై కుట్ర చేస్తున్నారు: మాజీ మంత్రి బాలినేని ఆవేదన
-
Politics News
Loan apps: వద్దన్నా లోన్లు.. ‘నగ్న ఫొటో’లతో వేధింపులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Aliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్ ఉద్వేగం.. వీడియో వైరల్
- Tollywood: టాలీవుడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఆర్నెల్లలో హిట్ ఏది, ఫట్ ఏది?
- Andhra News: సభాపతి ప్రసంగం.. వెలవెలబోయిన ప్రాంగణం
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Chandrakant Pandit : చందునా.. మజాకా!
- KTR: యశ్వంత్ సిన్హాకు మద్దతు వెనక అనేక కారణాలు: కేటీఆర్