Published : 02 Jul 2022 02:17 IST

Bill Gates: 48 ఏళ్ల క్రితం నాటి తన రెజ్యూమ్‌ను పంచుకున్న బిల్‌ గేట్స్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా కుబేరుడు, బిజినెస్‌మ్యాన్‌ బిల్‌గేట్స్‌ (Bill Gates) ఓ అరుదైన విషయాన్ని లింక్‌డ్‌ఇన్‌ (LinkedIn) వేదికగా పంచుకున్నారు. 48 ఏళ్ల క్రితం తాను తయారు చేసుకున్న రెజ్యూమ్‌ను షేర్‌ చేశారు. రెజ్యూమ్‌ను లింక్‌డ్‌ఇన్‌లో పోస్టు చేస్తూ సరదా వ్యాఖ్యలు చేశారు. ‘మీరు ఈ మధ్యే డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులైనా, లేదా కాలేజీ చదువుల్ని మధ్యలోనే మానేసినవారైనా కానీ మీ రెజ్యూమ్‌ 48 ఏళ్ల క్రితం నాటి నా రెజ్యూమ్‌ కంటే కచ్చితంగా బెటర్‌గా ఉంటుందని భావిస్తున్నా’నంటూ పోస్టు చేశారు. కాగా ప్రస్తుతం ఆయన పోస్టు వైరల్‌గా మారింది.

బిల్‌గేట్స్‌ హార్వర్డ్‌ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో ఈ రెజ్యూమ్‌ను తయారు చేసుకున్నారు. ఇందులో తన పని అనుభవం సహా.. షాడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ స్ట్రక్చర్, డేటాబేస్ మేనేజ్‌మెంట్, కంపైలర్ నిర్మాణం, కంప్యూటర్ గ్రాఫిక్స్‌ లాంటి నైపుణ్యాలను రాసుకొచ్చారు. వీటితోపాటు ప్రోగ్రామింగ్ భాషల్లో తన ప్రావీణ్యాలను వెల్లడించారు. 1973లో సిస్టమ్స్ గ్రూప్, 1972లో సీటెల్‌లోని లకాసైడ్ స్కూల్లో కాంట్రాక్ట్‌పై సహ నాయకుడిగా, సహ భాగస్వామిగా పనిచేసినట్లు రాసుకొచ్చారు.

బిల్‌గేట్స్‌ ఈ రెజ్యూమ్‌ను పంచుకుంటూ దీనికి మరిన్ని మెరుగులు దిద్దితే బాగుండేదని కూడా అభిప్రాయపడ్డారు. అయితే నెటిజన్లు మాత్రం గేట్స్ రెజ్యూమ్ పర్‌ఫెక్ట్‌ ఉందని పేర్కొంటున్నారు. నేటి యువతలో స్ఫూర్తి నింపేందుకు నాటి అంశాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని