Bangladesh: బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం.. 24 మంది మృతి

బంగ్లాదేశ్‌లోని పంచగఢ్‌ జిల్లాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. కరాటోవ నదిలో పడవ మునిగిన ఘటనలో 24 మంది మృతి చెందారు.

Published : 25 Sep 2022 18:11 IST

ఢాకా: బంగ్లాదేశ్‌లోని పంచగఢ్‌ జిల్లాలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. కరాటోవ నదిలో పడవ మునిగిన ఘటనలో 24 మంది మృతి చెందారు. మరో 30 మంది గల్లంతయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు మొదలు పెట్టిన అధికారులు.. ఆచూకీ గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.

పంచగఢ్‌లో ఉన్న బోదేశ్వరి ఆలయ సందర్శనకు బోధ, పంచ్‌పిర్‌, మరియా, బంఘారీ ప్రాంతాలకు చెందిన యాత్రికులు పడవలో బయలుదేరారు. ఆలిగఢ్‌ ప్రాంతానికి చేరుకోగానే వారి పడవ కరాటోవ నదిలో ఒక్కసారిగా బోల్తాకొట్టింది. అప్రమత్తమైన కొంతమంది యాత్రికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా.. చాలా మంది చిన్నారులు, మహిళలు నదిలో మునిగిపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 24 మృతదేహాలను గుర్తించగా.. మరో 20 నుంచి 30 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పడవలో పరిమితికి మించి యాత్రికులు ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts