Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
తాను రాజీనామా చేసినప్పటినుంచి బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదని ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ వెల్లడించారు. ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి ఆయన ఇంగ్లాండ్‌లో...
లండన్: తాను రాజీనామా చేసినప్పటినుంచి బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదని ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ వెల్లడించారు. ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి ఆయన ఇంగ్లాండ్‌లోని చెల్టెన్‌హామ్‌లో టోరీ సభ్యులతో చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీగేట్ కుంభకోణంలో బోరిస్ జాన్సన్ పార్లమెంటును తప్పుదోవ పట్టించారా? లేదా? అన్న విషయంపై కొనసాగుతోన్న పార్లమెంటరీ విచారణపై సునాక్ అభిప్రాయాన్ని కోరగా.. ‘ఇది పూర్తిగా పార్లమెంటరీ ప్రక్రియ. ప్రభుత్వ ప్రక్రియ కాదు. కామన్స్ ప్రివిలెజెస్ కమిటీలోని ఎంపీలను గౌరవిస్తా. వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు’ అని బదులిచ్చారు.
‘వ్యక్తిగతంగా నేను ఉన్నత ప్రమాణాలను విశ్వసిస్తా. ప్రధానమంత్రి అయిన వెంటనే నేను మంత్రివర్గ ప్రయోజనాల కోసం స్వతంత్ర సలహాదారుడిని తిరిగి నియమిస్తాను. విశ్వాసం, చిత్తశుద్ధి, మర్యాదలు.. రాజకీయ ఆత్మకు సంబంధించిన అంశాలు’ అని పేర్కొన్నారు. దీంతో టోరీ సభ్యులనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా.. శుక్రవారం వేల్స్ పర్యటనలో ఉన్న బోరిస్ జాన్సన్‌కు సునాక్ సందేశాలు, ఫోన్ కాల్స్ విషయమై ప్రశ్నలు ఎదురుకాగా.. ఆయన వాటిని దాటవేశారు. బోరిస్ నాయకత్వంపై విశ్వాసం కోల్పోయానని చెబుతూ.. గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న రిషి సునాక్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాలు బోరిస్ రాజీనామాకు దారితీశాయి. ప్రస్తుతం ప్రధాని పదవికి లిజ్ ట్రస్, రిషి సునాక్ తుది పోటీలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్‌లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్‌లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది
-
బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
-
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
-
HYD News: బుద్వేల్, మోకిల లేఅవుట్లకు మోక్షం