Published : 08 Jul 2022 02:15 IST

Boris Johnson: ప్రపంచంలోనే ఉత్తమ జాబ్‌ వదులుకోవడం బాధగా ఉంది!

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేసిన అనంతరం బోరిస్‌ జాన్సన్‌ (Boris Johnson) దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ జాబ్‌ను వదులుకొన్నందుకు ఎంతో బాధగా ఉందన్నారు. ఈ జాబ్‌ను వదులుకొంటున్నందుకు తానెంతగా బాధపడుతున్నానో అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నానన్నారు. లండన్‌లోని తన అధికారిక నివాసం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ నుంచి ఆయన ప్రసంగించారు. కొత్తగా ఎన్నిక కాబోయే కన్జర్వేటివ్‌ పార్టీ నేతకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు నాయకుడిని మార్చడం సరికాదని సహచరులను ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నించానని చెప్పారు. కరోనా మహమ్మారితో పాటు, యూరప్‌లో అత్యంత వేగంగా కొవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీ సహా పలు అంశాలను బోరిస్‌ తన ప్రసంగంలో ప్రస్తావించారు. 2019లో తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయడం తన పని, కర్తవ్యం, బాధ్యతగా భావించానన్నారు. అయితే, గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న హైడ్రామా గురించి ప్రస్తావించిన బోరిస్‌.. గొప్ప ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని మార్చడం సరికాదని సహచరులకు చెప్పి వారిని ఒప్పించేందుకు ప్రయత్నించిన విషయాన్ని తెలిపారు. 2019లో అపూర్వమైన తీర్పు ఇచ్చి.. ఇంతకాలం అధికారం కల్పించిన బ్రిటన్‌ ప్రజలకు బోరిస్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు, సొంత నేతల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి మేరకు బోరిస్‌.. పార్టీ అధినేతగా తప్పుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. బోరిస్ నాయకత్వంపై ఆయన మంత్రులు, అధికారులు విశ్వాసం కోల్పోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జాన్సన్‌ వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఇద్దరు మంత్రులు రాజీనామా చేయగా.. బుధవారం మరో 15 మంది మంత్రులు పదవులను వీడారు. ఇప్పటివరకూ మొత్తంగా 40 మందికి పైగా మంత్రులు తమ పదవుల నుంచి దిగిపోయారు. అక్టోబర్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ సమావేశంలో కొత్త నేతను ఎన్నుకొనే వరకు బోరిస్‌ జాన్సన్‌ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని