Brazil - Jair Bolsonaro: బ్రెజిల్ ఎన్నికల ఫలితాల తారుమారుకు బోల్సొనారో యత్నం.?
బ్రెజిల్‌లో జరిగిన అల్లర్లలో మాజీ అధ్యక్షుడు బోల్సొనారో పాత్రపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఆయన మంత్రి వర్గ సహచరుడి ఇంట్లో కీలక పత్రాలు దొరికాయి.
ఇంటర్నెట్‌డెస్క్: ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ బ్రెజిల్‌లో బోల్సొనారో(Jair Bolsonaro) మద్దతుదారులు అరాచకం సృష్టించడం వెనుక పెద్ద కుట్రే ఉండొచ్చనేందుకు తగిన ఆధారాలు బయటపడుతున్నాయి. గతంలో బోల్సొనారో ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అండర్సన్ టొర్రెస్ ఇంటిని బ్రెజిల్ పోలీసులు తనిఖీలు చేయగా.. కీలక పత్రాలు బయటపడ్డాయి. దేశ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు వీలుగా దేశంలో ‘స్టేట్ ఆఫ్ డిఫెన్స్’ చట్టాన్ని విధించేలా సిద్ధం చేసిన ఆదేశాల ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ విషయాన్ని దేశ న్యాయ విభాగ ప్రతినిధి లొరినా రెబిరో ప్రకటించారు. దొరికిన పత్రాలను విశ్లేషించగా.. ‘స్టేట్ ఆఫ్ డిఫెన్స్’ను అమలు చేయాలని దేశ ఎలక్టోరల్ కోర్టులో ప్రతిపాదించే పత్రాలుగా తేలాయన్నారు. ఈ పత్రాలపై బోల్సొనారో(Jair Bolsonaro) సంతకం లేదని ఆమె వివరించారు.
‘స్టేట్ ఆఫ్ డిఫెన్స్’ అనేది బ్రెజిల్‌లో చట్టపరమైన నిబంధన. ప్రజాజీవనాన్ని కాపాడేందుకు ప్రస్తుతం అధికారంలో ఉన్న అధ్యక్షుడు ప్రభుత్వంలోని ఇతర విభాగాల్లో జోక్యం చేసుకొనేందుకు అవకాశం ఇస్తుంది. బోల్సొనారో అక్టోబర్‌లోనే ఓడిపోగా.. డిసెంబర్ చివరి వరకు పదవిలోనే కొనసాగారు. తాజా ఘటనపై అండర్సన్ టొర్రెస్ స్పందించారు. తాను ఇంట్లో లేనప్పుడు పోలీసులు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకొన్నారన్నారు. వాటిని వక్రీకరించేలా లీక్ చేశారని ఆరోపించారు. తనకు వ్యక్తిగతంగా చెడ్డపేరు తెచ్చేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. బ్రెజిల్ చట్టాలంటే తనకు గౌరవమని పేర్కొన్నారు.
సోమవారం బ్రెజిల్‌లో బోల్సొనారో (Jair Bolsonaro)మద్దతుదారులు అల్లర్లకు తెగబడ్డారు. సుప్రీంకోర్టు, న్యాయస్థానం, నేషనల్ కాంగ్రెస్ భవనాలను ఆక్రమించారు. ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశాధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లూలాడ సిల్వాను అంగీకరించమన్నారు. ఈ కుట్రను పోలీసులు అణచివేశారు. ఈ అల్లర్లతో తనకు ఎటువంటి సంబంధం లేదని మాజీ అధ్యక్షుడు బోల్సొనారో తెలిపారు. పాతగాయం నొప్పి రావడంతో అమెరికాలోని ఒర్లాండోలోని ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బోల్సొనారో (Jair Bolsonaro)పై లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా విజయం సాధించారు. ఇటీవలే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే, ఈ ఫలితాలను తీవ్రంగా వ్యతిరేకించిన బోల్సొనారో.. తన పదవీకాలం ముగియడానికి రెండు రోజుల ముందే డిసెంబరు 31న అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఫ్లోరిడాలో ఉంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం