Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
శాస్త్రీయంగా కొన్ని పద్ధతుల్లో అందమైన వ్యక్తుల ముఖాలను గుర్తించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు ఈ ఏడాది అందమైన వ్యక్తి ఎవరనేది కూడా తేల్చేశారు.
లండన్: ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే? చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరి ముఖం, శరీరాకృతి ఒక్కో తీరులో ఉంటాయి. కానీ, శాస్త్రీయంగా కొన్ని పద్ధతుల్లో అందమైన వ్యక్తుల ముఖాలను గుర్తించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు (Scientists). అంతేకాదు ఈ ఏడాది అందమైన వ్యక్తి ఎవరనేది కూడా తేల్చేశారు. బ్రిటీష్ నటుడు రెగె జీన్ పేజ్ (Rege-Jean Page)ను అందమైన వ్యక్తిగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇందుకోసం సాంప్రదాయ ఫేస్ మ్యాపింగ్ పద్ధతి గ్రీక్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటి ఫై (Greek Golden Ratio of Beauty Phi) ని ఉపయోగించారు. దీంతో ఒక వ్యక్తి ముఖం ఎంత పరిపూర్ణంగా ఉందో లెక్కించవచ్చు.
బ్రిటన్‌కు చెందిన కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డి సిల్వా కంప్యూటరైజ్డ్ బ్యూటి ఫై మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా రెగె జీన్ పేజ్‌ను ప్రపంచంలోనే అందమైన వ్యక్తిగా గుర్తించారు. ఈ మ్యాపింగ్ ప్రక్రియ ప్రకారం జీన్ పేజ్ కళ్లు, కనుబొమ్మలు, ముక్కు, పెదాలు, దవడ, ముఖం అమరికను అంచనా వేస్తారు. అలా ఇతడి ముఖం 93.65 శాతం కచ్చితత్వంతో ఉన్నట్లు గుర్తించారు. తర్వాతి స్థానాల్లో థోర్ సినిమాలో నటించిన క్రిస్ హెమ్స్‌వర్త్ (93.53 శాతం), బ్లాక్ పాంథర్ నటుడు మిఖాయేల్ బి జోర్డాన్ (93.46 శాతం), సింగర్ హ్యారీ స్టైల్ (92 .30 శాతం)ల ముఖాలు ఉన్నట్లు వెల్లడించారు.
‘‘బ్యూటి ఫై మ్యాపింగ్ టెక్నిక్‌లు ఒక వ్యక్తిని శారీరకంగా అందంగా ఉన్నాడనేందుకు అవరసరమైన అంశాలను విశ్లేషించి కచ్చితమైన ఫలితాలను వెల్లడిస్తాయి. ఇవి మాకు శస్త్రచికిత్సలు చేసేప్పుడు ఉపయోగపడతాయి. ఇదే ప్రమాణాలను ఉపయోగించి రెగె జీన్ పేజ్‌ను అందమైన వ్యక్తిగా గుర్తించాం. శాస్త్రీయంగా అతనికి అందమైన ముఖం, గోధుమ రంగు కళ్లు ఉన్నాయి. కళ్లు, పెదాలు కచ్చితమైన స్థానాల్లో ఉండటంతో అతని ముఖం అందమైనదిగా పరీక్షల్లో నిర్ధరణ అయింది ’’ అని డాక్టర్ జూలియన్ డి సిల్వా తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Avatar 2 OTT Release Date: ఓటీటీలో అవతార్ 2.. ప్రీబుకింగ్ ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే!
-
Politics News
YSRCP: అన్నీ ఒట్టి మాటలేనా?.. వైకాపా ఎమ్మెల్యేకు నిరసన సెగ
-
Sports News
Ashwin: మాది బలమైన జట్టు..విమర్శలపై ఘాటుగా స్పందించిన అశ్విన్
-
World News
Pakistan: మా దేశంలో ఎన్నికలా.. కష్టమే..!
-
Movies News
Ram gopal varma: ఆర్జీవీ నా ఫస్ట్ ఆస్కార్ అన్న కీరవాణి.. వర్మ రిప్లై ఏంటో తెలుసా?
-
General News
Harish rao: కొత్త వైద్య కళాశాలల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: హరీశ్‌రావు