Storm: రెండువారాలకు సరకులు.. ఇసుక బ్యాగులు దగ్గరుంచుకోండి..!
కాలిఫోర్నియా(California )పై మరోసారి ప్రకృతి ప్రకోపించేలా కనిపిస్తోంది. భారీ తుపాను రానుందంటూ అక్కడి ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది.
కాలిఫోర్నియా: అమెరికా(America)లోని కాలిఫోర్నియా(California)కు భీకర తుపాను ముప్పుపొంచి ఉంది. గురువారం ఆ రాష్ట్రంలోని మధ్య, ఉత్తర ప్రాంతాల్లో తుపాను బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు హెచ్చరించారు. ‘భారీ వర్షాలు, మంచు కరగడం వల్ల వరదల ముప్పు పొంచి ఉంది. అవి లోతట్టు ప్రాంతాలకు తీవ్ర ప్రమాదంగా మారొచ్చు’ అని వెల్లడించింది. ఈ తుపానుతో చిన్న కాలువలు, సరస్సులు పొంగుతాయని, తర్వాత నదుల్లో నీటి ప్రవాహం పెరిగి, రోడ్లన్నీ వరదనీటితో నిండిపోతాయని వాతావరణ విభాగం అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ హెచ్చరికల నేపథ్యంలో మాంటిరే కౌంటీ తన ప్రజలను అప్రమత్తం చేసింది. రెండు వారాలకు సరిపడా సరకులను దగ్గర ఉంచుకోవాలని నివాసితులకు సూచించింది. అలాగే ఇసుక బ్యాగులను దగ్గర ఉంచుకోవాలని చెప్పింది. నివారణ చర్యల్లో భాగంగా వాటిని వాడేందుకు ఈ సూచన చేసింది. గత కొంతకాలంగా కాలిఫోర్నియా(California) ప్రకృతి వైరీత్యాలతో వణికిపోతోంది. ఫిబ్రవరిలో ముంచుగుప్పిట్లో మునిగిపోయింది. 70mphవేగంతో వీచిన గాలులు అల్లకల్లోలం చేశాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచే సుకేశ్ మరో ప్రేమలేఖ
-
Ap-top-news News
‘నీట్’కు 17 ఏళ్ల కంటే ఒక్కరోజు తగ్గినా మేమేం చేయలేం: ఏపీ హైకోర్టు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/03/2023)
-
Sports News
నిఖత్ కొట్టేయ్ మళ్లీ.. నేడు జరీన్ ఫైనల్
-
Movies News
భయపడితే.. కచ్చితంగా చేసేస్తా!
-
Movies News
Social look: సమంత ప్రచారం.. రాశీఖన్నా హంగామా.. బటర్‌ప్లై లావణ్య..