కంబోడియాలో విషాదం.. వృద్ధుడిపై 40 మొసళ్ల దాడి!

కంబోడియాలోని (Cambodia) ఓ మొసళ్ల సంరక్షణ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్‌క్లోజర్‌లో ఉన్న 40 మొసళ్లు (Crocodiles) ఓ వృద్ధుడిపై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

Published : 26 May 2023 16:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంబోడియాలో (Cambodia) విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మొసళ్ల ఎన్‌క్లోజర్‌లో (Crocodiles) పడిన ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ అందులోని 40 మొసళ్లు అతడిపై దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.

కంబోడియాలోని సయొమ్ రీఫ్‌ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం మొసళ్లను పెంచుతోంది. ఈ క్రమంలో వాటి సంరక్షణ చూస్తున్న ఓ వృద్ధుడు (72), గుడ్లు పెట్టే బోనులో నుంచి ఓ మొసలిని బయటకు పంపించేందుకు ప్రయత్నించాడు. చేతిలో ఉన్న కర్రతో దానిని కదిలించాడు. ఊహించిన విధంగా ప్రవర్తించిన ఆ మొసలి.. కర్రను లోపలికి లాక్కుంది. దాంతో ఆ వృద్ధుడు ఎన్‌క్లోజర్‌లో పడిపోయాడు. వెంటనే అందులో ఉన్న మొసళ్లన్నీ అతడిని చుట్టుముట్టాయి. అతడు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదు. దాదాపు 40మొసళ్లు దాడి చేయడంతో ఆ వృద్ధుడి శరీరం ముక్కలుగా అయ్యిందని స్థానిక పోలీసులు వెల్లడించారు.

అంకోర్‌ వాట్‌కు ముఖద్వారంగా ఉన్న సయొమ్ రీఫ్‌ ప్రాంతంలో మొసళ్ల పెంపకం ఎక్కువ. ఇదే గ్రామంలో 2019లోనూ ఇదే విధమైన ఘటన చోటుచేసుకుంది. మొసళ్లను పెంచుతున్న ఓ కుటుంబానికి చెందిన రెండేళ్ల చిన్నారిపై  అవి దాడి చేశాయి. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు