Donald Trump: ట్రంప్ అరెస్టైతే.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చా..?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన లైంగిక సంబంధాల ఆరోపణల కేసు విచారణ అంశం ఆసక్తిగా మారింది. ఒకవేళ ఆయనపై అభియోగాలు రుజువైతే అమెరికా చరిత్రలోనే అటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న తొలి వ్యక్తిగా (అధ్యక్ష స్థానంలో) ట్రంప్ నిలిచిపోతారు.
న్యూయార్క్: త్వరలోనే నన్ను అరెస్టు చేసే అవకాశం ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ ట్రంప్‌పై అభియోగాలు రుజువైతే మాత్రం అమెరికా (America) చరిత్రలోనే నేరారోపణలు ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడిగా నిలిచిపోతారు. ఇదే సమయంలో ట్రంప్ అరెస్టైతే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో (Presidential Election) ఆయనపై ఏవిధమైన ప్రభావం చూపిస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో అసలు అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయవచ్చా..? అనే అనుమానాలు ట్రంప్ మద్దతుదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అరెస్టు కావడం, నేరారోపణలు రావడం అనేవి వచ్చే ఎన్నికల్లో ట్రంప్ పోటీకి సాంకేతికంగా ఎటువంటి ప్రభావం చూపవని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఎన్నికల్లో పోటీపై ప్రభావమెంత..?
2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని డొనాల్డ్ ట్రంప్ గతేడాదే ప్రకటించారు. మరింత మంది రిపబ్లికన్ నేతలు పోటీలో ఉన్నప్పటికీ ప్రైమరీల్లో పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన మహిళను డబ్బులతో ప్రలోభపెట్టినట్లు ట్రంప్‌పై వచ్చిన ఆరోపణల కేసు విచారణకు వచ్చింది. ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన వ్యక్తి పదవిలో ఉన్న సమయంలో లేదా పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఎటువంటి నేరారోపణలు ఎదుర్కోలేదు. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రచారాన్ని కొనసాగిస్తానని చెబుతున్నారు.
ప్రచారంలో ఇబ్బందులే..
దేశాధ్యక్ష పోటీలో ఉండే అభ్యర్థి జైలు, నేర చరిత్రకు సంబంధించి అమెరికా రాజ్యాంగంలో ఎటువంటి ప్రస్తావన లేదు. పోటీలో ఉండే వ్యక్తి అమెరికాలో జన్మించి ఉండాలి. అమెరికా పౌరుడై, కనీస వయసు 35ఏళ్లు ఉండాలి. అధ్యక్ష పదవికి అర్హతలు. దీని ప్రకారం, ట్రంప్ జైలు వెళ్లాల్సి వచ్చినా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎటువంటి ఆటంకం ఉండదని తెలుస్తోంది. కానీ, ఆరోపణలు రుజువైతే మాత్రం ట్రంప్‌నకు ప్రజల దృష్టిలో, ప్రచారం సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని అంచనా. లేదా ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే జైలు నుంచే ప్రమాణస్వీకారం చేయడం కూడా ఇబ్బంది కలిగించే అంశాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇదిలాఉంటే, లైంగిక సంబంధాలు నెరిపాడని ఆరోపించిన మహిళలను డబ్బుతో ప్రలోభపెట్టడం, 2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించడం వంటి పలు అభియోగాలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్నారు. మాన్హాటన్ జిల్లా అటార్నీ కార్యాలయం నుంచి అనధికారికంగా తెలిసిన సమాచారం ప్రకారం తాను 21వ తేదీన అరెస్టు అయ్యే అవకాశం ఉందని ట్రంప్ ఈ మధ్యే పేర్కొన్నారు. లైంగిక సంబంధాల ఆరోపణల్ని ఇదివరకే తోసిపుచ్చిన ఆయన.. ఒకవేళ తాను అరెస్టైతే పెద్దఎత్తున నిరసనలు తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ మరోసారి తీవ్ర అభ్యంతరం తెలిపింది. వాటిని అసమంజసమైనవిగా పేర్కొంది. -
Pakistan: భారత్‌తో వాణిజ్యం.. మాట మార్చిన పాకిస్థాన్!
భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని వారం క్రితం చెప్పిన పాకిస్థాన్.. తాజాగా మాట మార్చింది. -
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్‌లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్‌లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్‌కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్‌కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు