H1-B Visa: అమెరికా హెచ్‌1-బీ వీసాదారులకు కెనడా గుడ్‌న్యూస్‌

హెచ్‌1-బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులను తమ దేశానికి ఆకర్షించేందుకు కెనడా వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. దీనివల్ల భారత్‌ సహా ఇతర దేశాలకు చెందిన హెచ్‌1-బీ వీసా దారులకు లబ్ధి చేకూరనుంది.

Updated : 18 Jul 2023 20:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఆకర్షించడమే లక్ష్యంగా కెనడా (Canada) ప్రభుత్వం హెచ్‌1-బీ (H1-B) వీసా నిబంధనలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో హెచ్‌1-బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు కెనడాలో మూడు సంవత్సరాలు పనిచేసుకోవచ్చు. దీనివల్ల భారత్‌ సహా ఇతర దేశాలకు చెందిన హెచ్‌1-బీ వీసా దారులకు లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా, హెచ్‌1-బీ వీసాదారుల కుటుంబసభ్యులకు ఉద్యోగం చేసుకోవడంతోపాటు, చదువుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ కొత్త నిబంధన ఏడాది పాటు లేదా 10 వేల దరఖాస్తులను స్వీకరించే వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కెనడా ప్రభుత్వం తెలిపింది. 

‘‘కెనడా, అమెరికాల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల్లో హై-టెక్‌ విభాగాల్లో ఎన్నో వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో హెచ్‌1-బీ వీసాతో అమెరికాలో పనిచేస్తున్నవారు మూడేళ్లపాటు కెనడాలో పనిచేసుకునేందుకు జులై 16 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని కెనడా ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తు అనంతరం అనుమతి పొందిన వారు కెనడాలో ఏ ప్రాంతంలో ఏ సంస్థలో అయినా ఉద్యోగం చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. వారి కుటుంబసభ్యులు ఉద్యోగం లేదా చదువు కోసం తాత్కాలిక వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 

US military: ఒక్క అక్షరం ఎంత పనిచేసింది.. అమెరికా రహస్యాలు రష్యా మిత్రదేశం చేతికి..!

విదేశీ ఉద్యోగులు తమ దేశంలో టెక్నాలజీ సహా ఇతర ముఖ్యమైన రంగాల్లో పనిచేసేందుకు వీలుగా అమెరికా ప్రభుత్వం హెచ్‌1-బీ వీసాలను జారీ చేస్తుంది. వీటిపై ఆధారపడి అమెరికాలోని టెక్నాలజీ సంస్థలు భారత్‌, చైనా వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున నైపుణ్యం కలిగిన ఉద్యోగులు నియమించుకుంటాయి. గత కొంత కాలంగా కెనడా పలు సాంకేతిక రంగాల్లో ఎదగాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో పలు కంపెనీలు లేఆఫ్‌లు విధిస్తుండటంతో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను తమ దేశానికి ఆహ్వానించాలని నిర్ణయించింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని