Canada: ఫేక్ ఆఫర్ లెటర్లు..? 700 మంది భారతీయ విద్యార్థులకు బహిష్కరణ గండం..!
ఉన్నత విద్య కోసం కెనడా (Canada) వెళ్లిన కొందరు భారతీయులు బహిష్కరణ గండాన్ని ఎదుర్కొంటున్నారు. తప్పుడు దస్త్రాలతో పంజాబ్‌లోని ఓ కన్సల్టెన్సీ నుంచి వీసాలు పొందినట్లు కెనడియన్ బార్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CBSA) గుర్తించింది. దీంతో వందల మంది భారతీయులు డిపార్టేషన్ లెటర్లు అందించినట్లు సమాచారం.
దిల్లీ: ఉన్నత విద్యను (Foreign Education) అభ్యసించేందుకు భారత్ నుంచి విదేశాలకు వెళ్తోన్న వారి సంఖ్య ప్రతిఏటా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు యూరప్ దేశాలకూ భారతీయ విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో కెనడా (Canada) విద్యా సంస్థల్లో అడ్మిషన్ కోసం ఇచ్చిన ఆఫర్ లెటర్లలో కొన్ని తప్పుడువి (Fake Offer Letter) ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో సదరు విద్యార్థులకు కెనడియన్ బార్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CBSA) డిపార్టేషన్ లెటర్లు కూడా అందించినట్లు సమాచారం. ఇలా సుమారు 700 మంది భారతీయ విద్యార్థులు కెనడా నుంచి బహిష్కరణ (Deportation) గండాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. (International News)
డిపార్టేషన్ లెటర్లు అందుకున్న కొందరు విద్యార్థులు చెబుతున్న వివరాల ప్రకారం, పంజాబ్ జలంధర్‌లో ఓ వ్యక్తి ఎడ్యుకేషన్ మైగ్రేషన్ సర్వీసెస్ నిర్వహిస్తున్నాడు. కెనడాలోని ప్రముఖ కాలేజీలో అడ్మిషన్ కోసం ఒక్కో విద్యార్థి వద్ద నుంచి రూ.16లక్షలు వసూలు చేశాడు. దీంతో వారంతా 2018-19లో అడ్మిషన్ పొంది చదువులు కూడా పూర్తిచేశారు. అంతేకాకుండా వారిలో కొందరు ఉద్యోగాలూ సంపాదించి అక్కడే నివసిస్తున్నారు. ఇంతవరకు బాగానే నడిచింది. కానీ ఇలా వెళ్లిన వారిలో కొందరు కెనడాలో పీఆర్ (శాశ్వత నివాసం) కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన సీబీఎస్‌ఏ.. వీసా కోసం కొందరు విద్యార్థులు సమర్పించిన దస్త్రాలు నకిలీవని గుర్తించారు. ఇవన్నీ జలంధర్ కేంద్రంగా ఉన్న ఆ కన్సల్టెన్సీవేనని.. 2018-2022 మధ్య కాలంలో అక్కడనుంచి సుమారు 700 మంది కెనడాలో చదువులకు ఆఫర్ లెటర్లు పొందినట్లు సమాచారం.
ఈ తరహా భారీ మోసం వెలుగుచూడటం కెనడాలో ఇదే తొలిసారి అని తెలుస్తోంది. అయితే, బహిష్కరణను ఎదుర్కొంటున్న వారిలో పంజాబ్‌లోని జలంధర్ నుంచి వెళ్లిన వాళ్లే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కెనడాలో తప్పుడు దస్త్రాల అంశానికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జలంధర్ పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. ముగ్గురికి 14 రోజుల రిమాండ్
-
Sports News
Virat Kohli-RCB: విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్ చోప్రా
-
World News
US Visa: బిజినెస్, పర్యాటక వీసాపైనా ఇంటర్వ్యూలకు హాజరవ్వొచ్చు
-
Movies News
Nagababu: ‘ఆరెంజ్’ రీ రిలీజ్.. వసూళ్ల విషయంలో నాగబాబు వినూత్న నిర్ణయం
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో మరో ఇద్దరికి అధిక మార్కులు.. సిట్ దర్యాప్తులో వెల్లడి
-
India News
Vijay Mallya: అప్పు చెల్లించకుండా.. విదేశాల్లో మాల్యా ఆస్తులు కొనుగోలు: సీబీఐ