Viral: కెనడా పార్లమెంట్‌లో ఎంపీ ‘కన్నడ’ ప్రసంగం.. వీడియో వైరల్‌

కెనడా పార్లమెంట్‌లో ఓ భారత సంతతి ఎంపీ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఎంపీ తన మాతృభాష అయిన కన్నడలో మాట్లాడటమే

Published : 20 May 2022 19:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెనడా పార్లమెంట్‌లో ఓ భారత సంతతి ఎంపీ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఎంపీ తన మాతృభాష అయిన కన్నడలో మాట్లాడటమే అందుకు కారణం. మాతృభాష మీద ఆయన చూపించిన ప్రేమకు తోటి ఎంపీలతో పాటు నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

కెనడాలోని నెపియన్‌ ప్రాంత ఎంపీ అయిన చంద్ర ఆర్య గురువారం పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ‘‘గౌరవీనయులైన సభాపతికి.. కెనడా పార్లమెంట్‌లో కన్నడలో మాట్లాడే అవకాశం నాకు లభించినందుకు ఆనందంగా ఉంది. భారత దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో గల తుముకూరు జిల్లా ద్వరాలు గ్రామం సిరా తాలూకాలో పుట్టిన ఓ వ్యక్తి.. కెనడాలో పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికవ్వడం, ఈ పార్లమెంట్‌లో కన్నడలో మాట్లాడటం 5కోట్ల మంది కన్నడీగులకు గర్వకారణం’’ అంటూ కన్నడలో చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగం పూర్తయిన వెంటనే తోటి ఎంపీలంతా లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చంద్ర ఆర్య తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయగా.. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

కర్ణాటకలోని తుముకూరుకు చెందిన చంద్ర ఆర్య.. ధార్వాడ్‌లోని బిడినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కెనడా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 2019లో జరిగిన కెనడా జనరల్‌ ఎలక్షన్స్‌లో లిబరల్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆర్య గతంలో ఒట్టావా కమ్యూనిటీ ఇమ్మిగ్రెంట్స్‌ సర్వీసెస్‌ ఆర్గనేజేషన్‌కు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఇండో కెనడా ఒట్టావా బిజినెస్‌ ఛాంబర్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని