Canadia: అల్బెర్టాలో దావానలం.. వైల్డ్‌లైఫ్‌ ఎమర్జెన్సీగా ప్రకటన

కెనడాలో దావానలం భారీగా వ్యాపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రాల్లో కొన్ని ఉన్న అల్బెర్టా  ప్రావిన్స్‌లోని అటవీ ప్రాంతం దగ్ధమవుతోంది.

Updated : 07 May 2023 11:03 IST

ఇంటర్నెట్‌డెస్క్: కెనడా(Canada)లోని అల్బెర్టా(Alberta) అటవీ ప్రాంతంలో భారీగా మంటలు(wildfires) వ్యాపిస్తున్నాయి. ఇవి మొత్తం పశ్చిమ కెనడా ప్రావిన్స్‌కు విస్తరించే దిశగా కదులుతున్నాయి. దాదాపు 25,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అల్బెర్టాలో దావానలం అనుకోని సంక్షోభమని అధికారులు చెబుతున్నారు. దాదాపు 100కుపైగా ప్రదేశాల్లో అగ్నికీలలు విరుచుకుపడుతున్నాయి. ప్రజలు ఎవరైనా ఆ ప్రాంతంలో ఉంటే తక్షణమే ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బలమైన గాలుల కారణంగా ఈ మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. దాదాపు మూడో వంతు మంటలను అదుపు చేయడం సాధ్యం కాదాని భావిస్తున్నారు. 

దీనిపై ప్రావిన్స్‌ ప్రీమియర్‌ డేనియల్‌ స్మిత్‌ మాట్లాడుతూ ‘‘మేము ప్రావిన్స్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించాం. ప్రభుత్వానికి దీనిని ఎదుర్కొనే శక్తి ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది వేసవిలో వేడి, పొడి వాతావరణం ఎక్కువగా ఉండటం మంటలకు అనుకూలంగా మారిందని ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలోనే చమురు అత్యధికంగా ఉత్పత్తి చేసే ప్రదేశాల్లో అల్బెర్టా కూడా ఒకటి. ఇప్పటి వరకు చమురు ఉత్పత్తికి ఎటువంటి ఆటంకం ఎదురు కాలేదని అధికారులు చెబుతున్నారు. దాదాపు 20 కమ్యూనిటీలను పూర్తిగా ఖాళీ చేయించారు. ఇప్పటికే 1,22,0000 హెక్టార్ల అటవీప్రాంతం దగ్ధమైంది. అల్బెర్టా చుట్టు పక్కల ప్రాంతాల ప్రావిన్స్‌లకు కూడా ఈ దావానలం వ్యాప్తించే ప్రమాదం ఉంది. సహాయక చర్యల నిమిత్తం పడవలు, హెలికాప్టర్లను ఇప్పటికే మోహరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని