Plane Accident: ల్యాండ్‌ అవుతుండగా.. రెండు ముక్కలైన విమానం..!

కోస్టారికాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శాన్‌ జోస్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో దిగుతుండగా ఓ కార్గో విమానం క్రాష్‌ ల్యాండ్ అయ్యింది. దీంతో ఆ విమానం రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఇందుకు

Published : 08 Apr 2022 10:02 IST

శాన్‌ జోస్‌: కోస్టారికాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శాన్‌ జోస్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో దిగుతుండగా ఓ కార్గో విమానం క్రాష్‌ ల్యాండ్ అయ్యింది. దీంతో ఆ విమానం రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

జర్మన్‌ లాజిస్టిక్స్‌ దిగ్గజం డీహెచ్‌ఎల్‌ సంస్థకు చెందిన బోయింగ్‌ -757 కార్గో విమానం గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో(కోస్టారికా కాలమానం ప్రకారం) శాన్‌జోస్‌ శివారులో ఉన్న జుయాన్‌ శాంతామరియా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. అయితే కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మెకానికల్‌ ఫెయిల్యూర్‌ కారణంగా 25 నిమిషాలకే అత్యవసర ల్యాండింగ్‌ కోసం ఎయిర్‌పోర్టుకు వెనుదిరిగింది.

అయితే విమానం దిగుతుండగా ప్రమాదవశాత్తూ రన్‌వేపై నుంచి జారిపడింది. దీంతో వెనుక చక్రాల వద్ద రెండు ముక్కలుగా విరిగిపోయి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. ఘటన సమయంలో విమానంలో ఇద్దరు క్రూ సిబ్బంది ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కానప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. రెండు ముక్కలైన విమానం ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని