
Train: అక్కడ రైలు నడవాలంటే పట్టాలకు మంట పెట్టాల్సిందే!
చికాగో: పైచిత్రం చూసి ఏ తీవ్రవాదులో, నక్సలైట్లో రైల్వే ఆస్తుల్ని దహనం చేస్తున్నారని అనుకుంటే పొరపాటే. రైల్వే సిబ్బందే ఇలా పట్టాలకు నిప్పు పెట్టారు. ఎందుకంటారా..? చలికాలంలో రైళ్ల రాకపోకలు సజావుగా సాగడానికి ఈ విధంగా చేస్తుంటారట. యూఎస్‌లోని చికాగోలో ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో మంచు పేరుకుపోయి పట్టాలు సంకోచించి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా పట్టాలకు నిప్పు పెడుతున్నారు. ఆ వెచ్చదనానికి పట్టాలు రైళ్ల ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. అయితే, పట్టాల వెంట కనిపిస్తున్నది నిజమైన మంట కాదండోయ్. ప్రత్యేక ట్యూబులర్ హీటింగ్ వ్యవస్థతో ఏర్పడిన సెగలు. చూడటానికి అవి మంటల్లాగే కనిపిస్తుంటాయి. వీటి వల్ల రైళ్లకు ఎలాంటి ప్రమాదముండదు. చలికాలం పోగానే ఈ వ్యవస్థను తొలగిస్తారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
-
World News
Antonio Guterres: ఆహార కొరత.. ప్రపంచానికి మహా విపత్తే : ఐరాస చీఫ్ హెచ్చరిక
-
India News
50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Sports News
Bizarre Dismissals: క్రికెట్లో విచిత్రమైన ఔట్లు.. వీటిపై ఓ లుక్కేయండి..!
-
General News
cardiac arrest: అకస్మాత్తుగా గుండె ఆగిపోయినపుడు ఏం చేయాలి..?
-
Politics News
Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- Social Look: నయన్- విఘ్నేశ్‌ల ప్రేమ ‘క్లిక్’.. వేదిక పంచ్!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Maharashtra: హోటల్ నుంచి పారిపోయి వచ్చా.. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- Covid Endemic: కరోనా మహమ్మారి ఎండెమిక్ దశకు వచ్చినట్లేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే
- Pawan kalyan: బాలినేనీ.. మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి: పవన్ కల్యాణ్