Mass Stabbing: ఫ్రాన్స్‌లో కత్తిపోట్ల కలకలం.. చిన్నారులతోసహా ముగ్గురి పరిస్థితి విషమం!
ఫ్రాన్స్ (France)లో వరుస కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఇక్కడి అనెసీ (Annecy) ప్రాంతంలోని ఓ పార్కులో ఆడుకుంటున్న చిన్నారులతోసహా పలువురిపై నిందితుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.
పారిస్: ఫ్రాన్స్ (France)లో కత్తిపోట్లు తీవ్ర కలకలం రేపాయి. ఇక్కడి అనెసీ (Annecy) పట్టణంలోని ఓ పార్కులో దుండగుడు కత్తితో వరుస దాడుల (Mass Stabbing)కు దిగాడు. అక్కడ ఆడుకుంటున్న చిన్నారులతోసహా పలువురిని గాయపరిచాడు. ఈ క్రమంలోనే నలుగురు పిల్లలు, ఇద్దరు వ్యక్తులకు గాయాలైనట్లు సమాచారం. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ డార్మనిన్ ఈ ఘటనను ధ్రువీకరించారు. దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ట్వీట్ చేశారు.
ఈ ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ప్రధాన మంత్రి ఎలిజబెత్ బార్న్ ఘటనాస్థలికి బయల్దేరారు. మరోవైపు పోలీసులు ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. గాయపడిన నలుగురు చిన్నారుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. మిగతా ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఓ వ్యక్తికీ తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. క్షతగాత్రుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ దాడుల వెనుక ఉద్దేశాన్ని రాబట్టే దిశగా దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vishal: రూ. 6.5 లక్షలిచ్చా.. సెన్సార్ బోర్డులోనూ అవినీతి.. ఆరోపించిన విశాల్
-
Tragedy: అయ్యో.. కూతురి పెళ్లి కోసం లాకర్లో ₹18లక్షలు దాస్తే... చివరకు..!!
-
Byreddy Rajasekhar reddy: స్కామ్‌లు చేయడం జగన్‌కు అలవాటేమో.. చంద్రబాబుకు కాదు: బైరెడ్డి
-
Kadapa: సచివాలయంలో సర్వేయర్‌పై వైకాపా కార్యకర్త దాడి
-
Jagan-adani: సీఎం జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ
-
రోజుకు నాలుగు గంటలు ఫోన్లోనే.. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వాడకం