Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
చిలీలో జులై 30వ తేదీన ఒక్కసారిగా పుట్టుకొచ్చిన గొయ్యి (సింక్ హోల్) నానాటికీ విస్తరిస్తోంది. తాజాగా 160 వెడల్పు, 656 అడుగుల లోతుకు పెరిగిపోయింది. దీనిలో ఆరు క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహాలు పడతాయి.
ఇంటర్నెట్‌డెస్క్: చిలీలో జులై 30వ తేదీన ఒక్కసారిగా పుట్టుకొచ్చిన భారీ గొయ్యి (సింక్ హోల్) నానాటికీ విస్తరిస్తోంది. తాజాగా 160 అడుగుల వెడల్పు, 656 అడుగుల లోతుకు పెరిగిపోయింది. ఇది ఎంత పెద్దగా ఉందంటే.. ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఇందులో సులభంగా ఇమిడిపోతుంది.. ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ఆర్క్ డి ట్రయాంఫ్ పూర్తిగా ఈ గొయ్యిలో పట్టగలదు. ఈ మిస్టరీ గొయ్యిపై చిలీకి చెందిన నేషనల్ సర్వీస్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ విభాగం అధికారులు శనివారం స్పందిస్తూ.. ఇది ఏర్పడటానికి కారణాలను పరిశీలిస్తున్నామన్నారు.
ఈ గొయ్యి ఏర్పడిన ప్రదేశానికి అత్యంత సమీపంలోని అల్కాపరోసా అండర్ గ్రౌండ్ గనులను కెనడాకు చెందిన కంపెనీ లుండిన్ మైనింగ్ ఎల్‌యూఎన్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ గనిలోని పనులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ గనిలో 80శాతం వాటా కెనడా కంపెనీది కాగా.. మిగిలిన 20శాతం వాటా జపాన్‌కు చెందిన సుమిటోమో మెటల్ మైనింగ్‌కు చెందింది. ఇక్కడ అనుమతులకు మించి మైనింగ్ జరిగినట్లు కూడా ఎటువంటి ఆధారాలు లేవని చిలీ మంత్రి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే గనిలో నీటిని తోడే యంత్రాలను చేర్చారు. మరికొద్ది రోజుల్లో గని ఛాంబర్లు ఎక్కడైనా దెబ్బతిన్నాయేమో పరిశీలించనున్నారు. ఈ గొయ్యి కారణంగా భూగర్భ గని.. భవిష్యత్తులో వరదల్లో చిక్కుకోవచ్చని అనుమానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
గాజా జనాభాలో 70 శాతం మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నట్లు ఐరాస(UN) ఆందోళన వ్యక్తం చేసింది. -
India- China: ఎన్నిసార్లు వాదించినా వాస్తవాలు మారవు.. చైనాకు భారత్ కౌంటర్
అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమని చైనాకు విదేశాంగశాఖ మరోసారి స్పష్టం చేసింది. -
Flight Journey: ‘లావుగా ఉన్నామని విమానం నుంచి దించేశారు’
లావుగా ఉన్నారనే నెపంతో ఇద్దరు మహిళలను విమానం నుంచి దించేసిన దారుణ ఘటన ఎయిర్ న్యూజిలాండ్‌లో (New Zealand) చోటుచేసుకుంది. -
Israel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో టాప్ కమాండర్ హతం
హమాస్ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్ నంబర్ 3 కమాండర్ మార్వాన్ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. -
పుతిన్ కొత్త రికార్డు!
రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ అంటే రష్యా.. ఇది మరోసారి రుజువైంది. విమర్శలు ఎన్నిఉన్నా.. అనుకున్నది సాధించి చూపడంలో తనదైన శైలిని సొంతం చేసుకున్న నేత వరసగా అయిదోసారి అధ్యక్షునిగా.. రికార్డుస్థాయిలో 87.29% ఓట్లతో నెగ్గారు. -
ఢీ అంటే ఢీ అంటున్న పాక్, అఫ్గాన్
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల మధ్య ఘర్షణ వాతావరణం ముదురుతోంది. ఈ నెల 16న పాక్‌లో మీర్ అలీ లోని పాక్ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి అయిదుగురు సైనికులు, ఇద్దరు అధికారులను హతమార్చారు. -
గూఢచారి నుంచి అధ్యక్షుడి వరకు..
ప్రధానిగా, అధ్యక్షుడిగా కలిపి గత 24 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న వ్లాదిమిర్ పుతిన్ రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. అధ్యక్షుడిగా తాజా ఎన్నికతో లభించిన ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటే ఆయన ఈ ఘనత సాధించనున్నారు. -
ఏడువేల కంటైనర్లలో.. రష్యాకు ఉత్తరకొరియా యుద్ధసామగ్రి
ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు గతేడాది నుంచి ఉత్తరకొరియా దాదాపు 7 వేల కంటైనర్ల యుద్ధ సామగ్రిని సరఫరా చేసిందని దక్షిణకొరియా రక్షణ శాఖ మంత్రి షిన్ వాన్ సిక్ వెల్లడించారు. -
నైజీరియాలో 100 మంది గ్రామస్థుల కిడ్నాప్
నైజీరియాలో సాయుధ ముఠాలు మళ్లీ చెలరేగిపోయాయి. వాయువ్య సరిహద్దులోని కదునా రాష్ట్రం కజూరూ కౌన్సిల్‌లోని గ్రామాలపై దాడులుచేసి 100 మంది గ్రామస్థుల్ని అపహరించుకుపోయారు. -
ఆసుపత్రిపై ‘ఆపరేషన్’!.. గాజాలో మరో 81 మంది మృతి
గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి అల్ షిఫాను సోమవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయి. వేల మంది ఆశ్రయం పొందుతున్న ఈ ఆసుపత్రిలోని అణువణువునూ శోధిస్తున్నాయి. -
రష్యా నుంచి విడిపించాలని వీడియోలో భారతీయుల వినతి
అనూహ్య పరిస్థితుల్లో రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. -
ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు!
మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు. -
క్షామం అంచున గాజా
ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని ఐరాస ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. -
నెల తర్వాత మాట్లాడుకున్న బైడెన్, నెతన్యాహు
కాల్పుల విరమణ, గాజాలో మానవతా సాయం విషయంలో మనస్పర్థలకారణంగా గత కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెల తర్వాత మళ్లీ మాట్లాడుకున్నారు. -
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
రష్యాకు ఉత్తర కొరియా గతేడాది నుంచి దాదాపు ఏడు వేల కంటెయినర్ల ఆయుధ సామగ్రి, ఇతర సైనిక పరికరాలను చేరవేసినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
తాజా వార్తలు (Latest News)
-
Zomato: జొమాటో కొత్త సేవలు.. వెజిటేరియన్స్‌కు ఇక ప్రత్యేకంగా
-
Paris Olympics: ఒలింపిక్ విలేజ్‌లో 3లక్షల కండోమ్‌లు..!
-
Janasena: పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైంది: పవన్ కల్యాణ్
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు