China: షాంఘై లాక్‌డౌన్‌ను అమెరికా ఆయుధంలా వాడుకొంటోంది..!

అమెరికా కాన్సులేట్‌ సిబ్బంది షాంఘైనీ వీడాలని ఆదేశించడాన్ని చైనా తప్పుపట్టింది. అమెరికా అధికారులు షాంఘై లాక్‌డౌన్‌ను కూడా దుష్ప్రచారానికి ఆయుధం వలే వాడుకొనేందుకు

Published : 13 Apr 2022 16:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా కాన్సులేట్‌ సిబ్బంది షాంఘైని వీడాలని ఆదేశించడాన్ని చైనా తప్పుపట్టింది. అమెరికా అధికారులు షాంఘై లాక్‌డౌన్‌ను కూడా దుష్ప్రచారానికి ఆయుధంలా వాడుకొనేందుకు చూస్తోందని ఆరోపించింది. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ విషయాన్ని ఆ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్‌ న్యూస్‌ బ్రీఫింగ్‌లో వెల్లడించారు. ‘‘అమెరికా సిబ్బంది తరలింపును రాజకీయం చేయడం, ఆయుధీకరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. చైనా అనుసరించే నివారణ, నియంత్రణ విధానాలు పూర్తిగా శాస్త్రీయమైనవి’’ అని పేర్కొన్నారు. 

షాంఘైలోని తమ కాన్సులేట్‌ జనరల్‌లో పనిచేస్తున్న నాన్‌ ఎమర్జెన్సీ ఉద్యోగులు తమ కుటుంబాలతో సహా నగరాన్ని వీడాలని సోమవారం అమెరికా పేర్కొంది. ఉద్యోగులు స్వచ్ఛందంగా షాంఘైనీ వీడేందుకు స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆమోదముద్ర వేసిన కొన్ని రోజుల్లోనే ఈ ప్రకటన వెలువడింది. అంతేకాదు.. అమెరికన్లు షాంఘై వెళ్లే అంశాన్ని పునః పరిశీలించుకోవాలని కూడా పేర్కొంది. చైనాలోని కఠిన నిబంధలను విధించి బిడ్డలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయడాన్ని ఈ సందర్భంగా ఉదహరించింది.  

షాంఘైలో సోమవారం రోజువారీ కేసుల సంఖ్య 26,000ను దాటేశాయి. అప్పటికి వారం నుంచి నిత్యం సగటున 20,000 కేసులు అక్కడ నమోదవుతున్నాయని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ లెక్కలు చెబుతున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి చైనాలోని 31 ప్రావిన్సుల్లో కలిపి 3,20,000 కేసులు నమోదవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని