
China: చైనాలో కొవిడ్ పరిస్థితులు దారుణం.. డైనమిక్ జీరో వ్యూహంతో ముందుకు!
బీజింగ్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి అదుపులోనే ఉన్నప్పటికీ చైనాలో మాత్రం తీవ్రరూపం దాలుస్తోంది. ముఖ్యంగా ఒమిక్రాన్ వేరియంట్‌తో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మార్చి నెలలోనే ఇప్పటివరకు 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ పరిస్థితులు తీవ్రంగా, అత్యంత జటిలంగా మారినట్లు చైనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ కొవిడ్ కట్టడికి అన్ని వ్యూహాలతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.
డైనమిక్ జీరో వ్యూహంతోనే..
చైనాలో గత కొంతకాలంగా పెరుగుతున్న కొవిడ్ విస్తృతి దృష్ట్యా పెద్ద నగరాలు కూడా పూర్తి లాక్డౌన్లోకి వెళ్లిపోతున్నాయి. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు 56వేల కేసులు నమోదైనట్లు చైనా నేషనల్ హెల్త్ మిషన్ అధికారులు పేర్కొన్నారు. అయితే, వీటిలో సగానికిపైగా కేవలం జిలిన్ ప్రావిన్సులోనే రికార్డయినట్లు తెలిపారు. హాంకాంగ్‌లో నమోదవుతున్న కేసులు వీటికి అదనం. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో పరిస్థితులు దారుణంగా, జటిలంగా మారాయని అన్నారు. అయినప్పటికీ డైనమిక్ జీరో కొవిడ్ లక్ష్యాన్ని స్వల్ప కాలంలో సాధించేందుకు కృషి చేస్తున్నామని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిపుణులు వూ జూన్‌యూ పేర్కొన్నారు. తద్వారా కొవిడ్ ముప్పు నుంచి బయట పడతామని ఆశాభావం వ్యక్తం చేశారు.
చైనాలో కొవిడ్ విస్తృతి పెరుగుతున్నప్పటికీ ‘జీరో కొవిడ్’ వ్యూహానికే కట్టుబడి ఉన్నట్లు చైనా పేర్కొంది. అయితే, ఈ వ్యూహంతో లాక్డౌన్లు, భారీ స్థాయిలో కొవిడ్ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి కఠిన చర్యలు చేపడుతూ కేసుల సంఖ్యను సున్నాకు తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వైరస్ ఉద్ధృతి తగ్గకపోగా.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కొవిడ్ కట్టడి వ్యూహాన్ని సడలిస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా డైనమిక్ కొవిడ్ జీరో వ్యూహాన్ని అమలు చేస్తామని, తద్వారా నగరాలపై మొత్తం ఒకేసారి ఆంక్షలు కాకుండా స్థానికంగా పరీక్షలు, కట్టడి చర్యలతో ముందుకు వెళ్తామని పేర్కొంది.
హాంకాంగ్‌లో నిత్యం 200 కొవిడ్ మరణాలు..
చైనాలో వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్నప్పటికీ చాలా మందికి చేరలేదని తెలుస్తోంది. చైనా ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం, 60 ఏళ్ల వయసుపైబడిన వారిలోనే ఇంకా 5 కోట్ల మందికి ఒక్క డోసు కూడా తీసుకోలేదు. బూస్టర్ డోసుల పంపిణీ కూడా మందకొడిగానే సాగుతోంది. కేవలం 50 శాతం మంది మాత్రమే బూస్టర్ తీసుకున్నారు. మరోవైపు హాంకాంగ్‌లో కొవిడ్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గత నెల రోజులుగా అక్కడ నిత్యం 200 కొవిడ్ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిరోజూ పదివేలకుపైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల మొదలైన వేవ్‌లో ఒక్క హాంకాంగ్ నగరంలోనే పదిలక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో చైనా అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
-
World News
Antonio Guterres: ఆహార కొరత.. ప్రపంచానికి మహా విపత్తే : ఐరాస చీఫ్ హెచ్చరిక
-
India News
50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Sports News
Bizarre Dismissals: క్రికెట్లో విచిత్రమైన ఔట్లు.. వీటిపై ఓ లుక్కేయండి..!
-
General News
cardiac arrest: అకస్మాత్తుగా గుండె ఆగిపోయినపుడు ఏం చేయాలి..?
-
Politics News
Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- Social Look: నయన్- విఘ్నేశ్‌ల ప్రేమ ‘క్లిక్’.. వేదిక పంచ్!
- మాయా(వి)వలలో విలవిల
- IND vs LEIC Practice Match : భళా అనిపించిన భారత బౌలర్లు.. మెరిసిన పంత్
- Maharashtra: హోటల్ నుంచి పారిపోయి వచ్చా.. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు