China: జీరో కొవిడ్ నిబంధనలు సడలించిన చైనా..!
చైనా(China)లో ఎట్టకేలకు జీరోకొవిడ్ (Zero Covid) నిబంధనలను సడలించారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఇంట్లోనే ఏకాంతంలో ఉండొచ్చు.
ఇంటర్నెట్‌డెస్క్: జీరో కొవిడ్(Zero Covid) నిబంధనలను సడలిస్తూ బుధవారం చైనా(China) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దాదాపు 10 రోజులుగా డజనుకు పైగా నగరాల్లో జీరో కొవిడ్(Zero Covid) నిబంధనలకు విరుద్ధంగా ప్రజలు ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. కొత్త నిబంధనల ప్రకారం తరచూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు, లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఇంట్లోనే ఏకాంతంలో గడపొచ్చు. గతంలో ఇటువంటి లక్షణాలు ఉన్నవారిని బలవంతంగా వైద్యశాలలకు తరలించేవారు. గతంలో ఏదైనా భవనంలో కొవిడ్ కేసు వస్తే ఆ ప్రాంతం మొత్తాన్ని సీల్ చేసేవారు. కానీ, ఇక ఆ విధానం అమలు చేయరు. ఆ భవనం నుంచి బయటకు వెళ్లే మార్గాలను తెరిచే ఉంచుతారు. ఈ విషయాన్ని బీజింగ్‌లోని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది.
చైనా(China)లో కఠిన లాక్‌డౌన్‌లతో జీరోకొవిడ్(Zero Covid) పాలసీని అమలు చేసి వైరస్ కట్టడి చేయాలని అధ్యక్షుడు జిన్‌పింగ్(xi jinping) భావించారు. దీనిని సీసీపీ ఘనతగా ప్రచారం చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో వైరస్‌పై ప్రజాయుద్ధం ప్రకటించారు. వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో డజన్ల కొద్దీ అధికారులను విధుల నుంచి తొలగించారు. నగరాల్లో లాక్‌డౌన్‌లు విధించారు. లాక్‌డౌన్‌లపై ప్రశ్నించిన ప్రజలు, వైద్య నిపుణుల నోళ్లను బలవంతంగా మూయించారు. దీని అమలును డిజిటల్ నిఘా కిందకు తీసుకొచ్చారు. దీంతో ప్రజలు బయటకు కదలాలన్నా ఇబ్బందికరంగా మారింది. మరోవైపు చైనా (China) ఆర్థిక వ్యవస్థకు ఇవి భారంగా పరిణమించాయి. దీంతోపాటు గ్వాంగ్‌ఝూ, బీజింగ్ వంటి పలు చోట్ల ఆందోళనలకు కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో దాదాపు 10 నిబంధనల్లో చైనా (China) సడలింపులు ఇచ్చింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSWRES: తెలంగాణ గురుకుల సైనిక స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
-
Movies News
srirama chandra: సింగర్ అసహనం.. ఫ్లైట్ మిస్సయిందంటూ కేటీఆర్‌కు విజ్ఞప్తి..!
-
India News
Temjen Imna Along: ‘నా పక్కన కుర్చీ ఖాళీగానే ఉంది’.. పెళ్లి గురించి మంత్రి ఆసక్తికర ట్వీట్
-
General News
TSPSC: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారు
-
Politics News
KTR: మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు: మంత్రి కేటీఆర్
-
Sports News
IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. అక్కడ టీమ్ఇండియాకు స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్