Chinese Apps: 54 యాప్స్‌పై భారత్‌ నిషేధం.. ఆందోళన వ్యక్తం చేసిన చైనా

దేశ భద్రతకు ముప్పు కారణాల దృష్ట్యా చైనాతో సంబంధమున్న 54 యాప్స్‌పై ఇటీవల కేంద్రం నిషేధం విధించింది. కేంద్ర హోంశాఖ సిఫార్సు మేరకే వాటిని నిషేధించినట్లు తెలుస్తోంది. కాగా ఈ పరిణామంపై చైనా స్పందించింది. భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. 

Published : 17 Feb 2022 20:25 IST

దిల్లీ: దేశ భద్రతకు ముప్పు కారణాల దృష్ట్యా చైనాతో సంబంధమున్న 54 యాప్స్‌పై ఇటీవల కేంద్రం నిషేధం విధించింది. కేంద్ర హోంశాఖ సిఫార్సు మేరకే వాటిని నిషేధించినట్లు తెలుస్తోంది. కాగా ఈ పరిణామంపై చైనా స్పందించింది. భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. 

‘చైనాతో సహా విదేశీ పెట్టుబడిదారులందరితో భారత్ పారదర్శకంగా వ్యవహరిస్తుందని నమ్ముతున్నాం. వివక్షాపూరిత నిర్ణయాలు తీసుకోదనుకుంటున్నాం. అలాగే ఇరు దేశాల మధ్య ఉన్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలు మరింత మెరుగయ్యేందుకు తగిన చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నాం’ అని ఆ దేశ వాణిజ్య శాఖ ప్రతినిధి గావో ఫెంగ్ వెల్లడించారు. 

ఈ నిషేధంపై ఆ సమయంలో హోంశాఖతో సంబంధమున్న వర్గాలు వివరాలు వెల్లడించాయి. ‘ఈ యాప్స్‌ యూజర్ల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఆ డేటాను తమ సొంతదేశంలో ఉన్న సర్వర్లకు బదిలీ చేస్తూ, దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి’ అని పేర్కొన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని