Arunachal Border: భారత సరిహద్దులో.. చైనా, పాకిస్థాన్‌ల సమావేశం!

భారత సరిహద్దులో పాకిస్థాన్‌, చైనాల నుంచి ముప్పు పొంచివున్న వేళ.. ఈ రెండు దేశాలూ అరుణాచల్‌ ప్రదేశ్‌కు అతిసమీపంలో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యాయి.

Published : 03 Oct 2023 19:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓవైపు పాకిస్థాన్‌, మరోవైపు చైనా నుంచి భారత్‌కు ముప్పు పొంచివున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత సరిహద్దుకు సమీపంలోనే చైనా (China) ఓ సమావేశానికి సిద్ధమైంది. టిబెట్‌లో నిర్వహిస్తోన్న 3వ ట్రాన్స్‌-హిమాలయ ఫోరం సమావేశానికి అటు పాకిస్థాన్‌ (Pakistan) కూడా హాజరుకానుంది. ఈ సమావేశం జరుగుతోన్న ప్రదేశం అరుణాచల్‌ ప్రదేశ్‌కు (Arunachal Border) అతి సమీపంలో ఉండటం గమనార్హం.

ట్రాన్స్‌-హిమాలయ ఫోరం ఫర్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ సమావేశాలు అక్టోబర్‌ 4-5 తేదీల్లో జరగనున్నాయి. స్వయంప్రతిపత్తి గల టిబెట్‌లోని నియాంగ్‌చి ఈ భేటీకి వేదిక కానుంది. ఇది టిబెట్‌ రాజధాని లాసాకు 400కి.మీ దూరంలో ఉండగా.. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సియాంగ్‌ జిల్లాకు మాత్రం అతి సమీపంలో (సుమారు 150కి.మీ) ఉంటుంది. ఈ సమావేశానికి పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి జలీల్‌ అబ్బాస్‌ జిలానీ కూడా హాజరుకానున్నట్లు అధికారంగా వెల్లడైంది. చైనా విదేశాంగ ఆహ్వానం మేరకు ఈ సమావేశాల్లో పాల్గొననున్నట్లు పాక్‌ విదేశాంగ ఓ ప్రకటనలో వెల్లడించింది. వీరితోపాటు మంగోలియా, అఫ్గానిస్థాన్‌ దేశాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో భాగస్వామ్యం కానున్నారు.

IAF: డైనమిక్‌ కార్యాచరణతో.. LAC వెంట నిరంతర పర్యవేక్షణ

ప్రాంతీయ దేశాలు ఆచరణాత్మక సహకారాన్ని (Practical Cooperation) మరింత విస్తృత పరిచేందుకుగాను ట్రాన్స్‌-హిమాలయ ఫోరం 20018లో ప్రారంభమైంది. పర్యావరణ పరిరక్షణ, భౌగోళిక అనుసంధానం, సాంస్కృతిక సంబంధాలను మరింత మెరుగుపరచుకునే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. 2019లో మరోసారి భేటీ అయ్యింది. తాజాగా మూడోసారి సమావేశమయ్యేందుకు సిద్ధమైంది. ఇదిలాఉంటే, చైనాతో సంబంధాలు సరిగ్గా లేవని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఇటీవలే ఉద్ఘాటించడం.. ఆసియా క్రీడల సందర్భంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ క్రీడాకారులకు వీసాలు ఇచ్చేందుకు చైనా నిరాకరించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని