China: చైనాలో ఒక్క రోజే 16 వేలకు పైగా కొత్త కేసులు..

చైనాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజు రోజుకీ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 16,412 క్రియాశీల కేసులు నమోదయ్యాయి.

Updated : 05 Apr 2022 15:16 IST

 మహమ్మారి ప్రారంభం నుంచి ఇవే అత్యధికం

షాంఘై: చైనాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజు రోజుకీ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 16,412 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ప్రారంభం నుంచి నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం అక్కడి అధికార వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో  చైనా ప్రభుత్వం 27 ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించింది. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో ఎక్కువగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారే ఉన్నారు. లాక్‌డౌన్‌ విధించినప్పటికీ ఈ  ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అధికారులు మరింత కఠిన ఆంక్షలను విధించాలనే యోచనలో ఉన్నారు.

ఇక ఆర్థిక కేంద్రంగా పరిగణించే షాంఘైలో రెండు దశల లాక్‌డౌన్‌ మార్చి 28 నుంచి కొనసాగుతోంది. ఈ ప్రాంతంలోని 26 మిలియన్ల మందికి కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు లాక్‌డౌన్‌ పొడిగించాలనే ఆలోచనల్లో అక్కడి ప్రభుత్వం ఉంది. అయితే.. కొత్తగా నమోదవుతోన్న కేసుల్లో.. ఎక్కువగా లక్షణాలు లేని వారే ఉంటున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని