Published : 23 May 2022 15:54 IST

China: చైనా-అమెరికా మాటల యుద్ధం..!

ఇంటర్నెట్‌డెస్క్‌: జపాన్‌ రాజధాని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ స్పందించారు. తైవాన్‌ విషయంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకొంటామని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘జాతీయ ప్రయోజనాలు, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో చైనాను ఎవరూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. చైనా జాతీయ భద్రత కాపాడుకొనే విషయంలో ప్రజల దృఢ చిత్తాన్ని తక్కువగా అంచనావేయలేము’’ అని అమెరికాను హెచ్చరించారు. 

అంతకు ముందు జపాన్‌ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ టోక్యోలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ..‘‘తైవాన్‌లో బలవంతంగా చైనా జోక్యం చేసుకొంటే.. అమెరికా సైనిక పరంగా స్పందిస్తుంది. అది మేము చేసిన వాగ్దానం. వన్‌ చైనా పాలసీకి అమెరికా కట్టుబడి ఉందంటే.. అది తైవాన్‌ను బలవంతంగా ఆక్రమించమని కాదు’’ అని పేర్కొన్నారు. గతంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలనే బైడెన్‌ చేయగా.. అప్పట్లో శ్వేత సౌధం తర్వాత వివరణ ఇచ్చింది. తైవాన్‌ విషయంలో అమెరికా పాలసీ మారలేదని పొడిపొడిగా చెప్పింది. దీంతో తైవాన్‌ విషయంలో అమెరికా పాటిస్తున్న వ్యూహాత్మక గందరగోళ పరిస్థితి కొనసాగించినట్లైంది. తైవాన్‌కు ఆయుధాల సరఫరా చేసినా.. సైనిక జోక్యం చేసుకొంటుందా అనేది మాత్రం తేలలేదు. తాజాగా సోమవారం బైడెన్‌ ప్రకటన అనంతరం కూడా శ్వేత సౌధం స్పందించింది.  తైవాన్‌ విషయంలో అమెరికా పాలసీలో ఎటువంటి మార్పు లేదని పునరుద్ఘాటించింది. 

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని