Published : 08 Feb 2022 16:12 IST

Covid Test: నాలుగు నిమిషాల్లోనే కొవిడ్‌ ఫలితాలు.. ఆర్టీపీసీఆర్‌ స్థాయి కచ్చితత్వం

కొత్త పరీక్షను ఆవిష్కరించిన చైనా శాస్త్రవేత్తలు

బీజింగ్‌: ఇటీవల సింగపూర్‌ శాస్త్రవేత్తలు ఐదు నిమిషాల్లోనే కరోనా ఫలితాలు వెల్లడించే ‘బ్రీత్‌లైజర్’ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. తాజాగా తాము కేవలం నాలుగు నిమిషాల్లోనే ఫలితాలు వెల్లడించే కొత్త పరీక్ష కిట్‌ను అభివృద్ధి చేసినట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. పీసీఆర్ టెస్ట్‌లాగే ఇదీ కచ్చితమైన రిజల్ట్‌ ఇస్తుందన్నారు. ప్రస్తుతం ‘ఆర్టీ-పీసీఆర్‌’ విధానాన్నే వైరస్‌ నిర్ధారణకు అత్యంత విశ్వసనీయ పరీక్షగా భావిస్తున్నారు. అయితే, దీని ద్వారా ఫలితాల వెల్లడికి చాలా సమయం పడుతోంది. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ ద్వారా తొందరగానే రిజల్ట్‌ వస్తున్నా, తప్పుడు ఫలితాలు ఎక్కువగా ఉంటున్నాయి! దీంతో టెస్టింగ్‌ డిమాండ్ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త కిట్‌ను అభివృద్ధి చేసినట్లు షాంఘైలోని ఫుడాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ‘నేచర్ బయోమెడికల్ ఇంజినీరింగ్’ జర్నల్‌లో సంబంధిత వివరాలు ప్రచురితమయ్యాయి.

‘సేకరించిన నమూనాల్లో సార్స్‌- కోవ్‌- 2 జాడను గుర్తించేందుకు ఇంటిగ్రేటెడ్, పోర్టబుల్ ప్రోటోటైప్ కిట్‌లో ఎలక్ట్రోమెకానికల్ బయోసెన్సార్‌ను అమర్చాం. నమూనాల్లోని జన్యు పదార్థాన్ని ఇది వేగంగా విశ్లేషించి, నాలుగు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో కచ్చితత్వంతో ఫలితాలను వెల్లడించింది’ అని శాస్త్రవేత్తలు వివరించారు. ట్రయల్స్‌లో భాగంగా షాంఘైలోని 33 మంది కరోనా బాధితుల నుంచి సేకరించిన నమూనాలను.. పీసీఆర్‌తోపాటు కొత్త విధానంలోనూ పరీక్షించారు. రెండింటిలో ఓకే విధమైన ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. కరోనా లేని 54 మంది నమూనాల విషయంలోనూ ఎలాంటి తప్పుడు ఫలితాలు వెల్లడించలేదని చెప్పారు. కొత్త పరీక్ష కిట్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాత.. విమానాశ్రయాలు, ఆస్పత్రులు, ఇంటివద్ద ఇలా ఎక్కడైనా ఉపయోగించవచ్చన్నారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని