Taiwan: తైవాన్‌పైకి దూసుకెళ్లిన చైనా విమానాల మంద..!

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తలకు చైనా ఆజ్యం పోస్తోంది. తాజాగా తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి 30 చైనా విమానాలు దూసుకెళ్లాయి.

Published : 31 May 2022 15:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలకు చైనా ఆజ్యం పోస్తోంది. తాజాగా తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి 30 చైనా విమానాలు దూసుకెళ్లాయి. ఈ ఘటన సోమవారం చోటు చేసుకొన్నట్లు తైవాన్‌ ప్రకటించింది. తైవాన్‌ పై చైనా దండెత్తితే తాము జోక్యం చేసుకొంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అదే రోజు అమెరికా అధికారులు తైవాన్‌ను సందర్శించారు. 

ఇటీవల కాలంలో తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి తరచూ చైనా విమానాలు చొరబడుతున్నాయి. అవి కేవలం ట్రైనింగ్‌ డ్రిల్స్‌ మాత్రమే అని చైనా సర్దిచెప్పుకొంటోంది. ఫలితంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతన్నాయి. తాజాగా తమ  ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌ పరిధిలోకి వచ్చిన వాటిలో 22 ఫైటర్‌ జెట్లు, ఎలక్ట్రానికి వార్ఫేర్‌, ఎర్లీవార్నింగ్‌, యాంటీ సబ్‌మెరైన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు ఉన్నాయని తైవాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతాస్‌ ద్వీపానికి ఈశాన్యంగా ఈ చొరబాటు చోటు చేసుకొన్నట్లు వెల్లడించింది. ఈ విమానాలు  ప్రాదేశిక గగనతలంలోకి మాత్రం చొరబడలేదని వివరించింది. గత ఏడాదిగా తైవాన్‌ ఈ రకమైన చొరబాట్లను ఎదుర్కొంటోంది. నిపుణులు దీనిని గ్రేజోన్‌ వార్ఫేర్‌గా అభివర్ణిస్తున్నారు. తైవాన్‌  ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో విశ్లేషించేందుకు చైనా ఈ వ్యూహం అనుసరిస్తోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని