China: చైనాలో భారీగా పెరుగుతోన్న నిరుద్యోగం..!

చైనాలో నిరుద్యోగం భారీగా పెరుగుతోంది. ఏప్రిల్‌ నెలలో 6.1శాతం నిరుద్యోగ రేటు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2020 కొవిడ్‌ వ్యాప్తి

Published : 16 May 2022 23:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాలో నిరుద్యోగం భారీగా పెరుగుతోంది. ఏప్రిల్‌ నెలలో 6.1 శాతం నిరుద్యోగిత రేటు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2020 కొవిడ్‌ వ్యాప్తి తొలి నాళ్లలో ఇది 6.2 శాతంగా నమోదైంది. తర్వాత ఆ స్థాయిలో నిరుద్యోగ పెరుగుదల నమోదవ్వడం ఏప్రిల్‌లోనే. కొవిడ్‌ లాక్‌డౌన్ల కారణంగా చైనా వృద్ధిరేటు ఒక్కసారిగా తగ్గిపోయింది. చిల్లర వ్యాపారులు, తయారీదారులు తీవ్రంగా ప్రభావితం అయ్యారు.

మార్చి, ఏప్రిల్‌లో చైనాలోని పలు నగరాల్లో పూర్తిగా, పాక్షికంగా లాక్‌డౌన్లు విధించారు. దీంతోపాటు షాంఘై లో సుదీర్ఘకాలం నుంచి కొవిడ్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా ప్రీమియర్‌ లీ క్వికియాంగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చైనాలో ఉద్యోగ కల్పన పరిస్థితి దారుణంగా ఉంది’’ అని పేర్కొన్నారు. చైనా ప్రభుత్వం నిరుద్యోగ రేటును 5.5 శాతానికి మాత్రమే పరిమితం చేయాలని తీవ్ర యత్నాలు చేస్తోంది.

చైనాలో ఏప్రిల్‌ నెల రిటైల్‌ విక్రయాలు 11.1 శాతం తగ్గాయి. మార్చి 2020 తర్వాత ఈ స్థాయిలో విక్రయాలు పతనం కావడం ఇదే. ఇది మార్చి నెలలో 3.5 శాతం ఉంది. ఈ గణాంకాలను చైనీస్‌ నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని