China: పుతిన్‌కు అరెస్టు వారెంట్.. స్పందించిన డ్రాగన్
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Xi Jinping) రష్యా చేరుకున్నారు. దీనికి ముందు ఐసీసీ.. పుతిన్‌కు ఇచ్చిన అరెస్టు వారెంట్‌పై డ్రాగన్ స్పందించింది.
బీజింగ్: రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్(Putin)కు అంతర్జాతీయ న్యాయస్థానం(ICC) జారీ చేసిన అరెస్టు వారెంట్‌పై చైనా(China) స్పందించింది. ఐసీసీ తన ద్వంద్వ వైఖరిని విడనాడాలని హితవు పలికింది.
‘ఐసీసీ నిష్పాక్షిక వైఖరితో వ్యవహరించాలి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అరెస్టుల వంటి వాటి నుంచి దేశాధినేతలకున్న ఇమ్యూనిటీని గౌరవించాలి. అలాగే ఐసీసీ రాజకీయాలకు దూరం ఉండటంతో పాటు ద్వంద్వ వైఖరిని విడనాడాలి’ అని చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ కోరారు. ఉక్రెయిన్(Ukraine)లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాల(War Crimes)కు బాధ్యుడిగా పేర్కొంటూ తాము వారెంట్ జారీ చేసినట్లు ఐసీసీ స్పష్టం చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలు ఈ నేరాలకు పాల్పడినట్లు పేర్కొంది. అయితే.. తాము ఐసీసీని గుర్తించడం లేదని, అందువల్ల దాని చర్యలు రష్యాపై చెల్లుబాటుకావని క్రెమ్లిన్(Kremlin) ఇప్పటికే స్పష్టం చేసింది.
మాస్కో చేరుకున్న జిన్‌పింగ్..
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్(Xi Jinping) రష్యాకు చేరుకున్నారు. మూడు రోజులపాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతోన్న వేళ.. ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు అధినేతలు సోమవారం రాత్రి చర్చలు జరపనున్నారు. ఇప్పటికే చైనా చెప్పిన శాంతి ప్రణాళికను రష్యా స్వాగతించింది. తమ చర్చల్లో దానిని కూడా భాగం చేసే అవకాశముందని చెప్పింది. బీజింగ్ కాల్పుల విరమణకు పిలుపునివ్వగా.. పశ్చిమ దేశాలు ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)
-
Movies News
Siddharth: ఆమెను చూడగానే ఒక్కసారిగా ఏడ్చేసిన హీరో సిద్ధార్థ్
-
Movies News
Anasuya: ఇకపై ఆపేద్దామనుకుంటున్నా.. విజయ్‌తో వార్‌పై తొలిసారి స్పందించిన అనసూయ
-
Sports News
Trent Boult: ట్రెంట్ బౌల్ట్ ఈజ్ బ్యాక్.. వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం!
-
Movies News
Vimanam: ప్రివ్యూలకు రావాలంటే నాకు భయం.. ఇలాంటి చిత్రాలు అరుదు: శివ బాలాజీ