Taiwan: ఆక్రమణ కోసమే చైనా సన్నాహాలు

తైవాన్‌ సమీపంలో చైనా యుద్ధ విన్యాసాలతో హోరెత్తిస్తోంది. దీనిపై తైవాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్‌ వూ తైపేలో జరిగిన ఓ విలేకర్ల సమావేశంలో స్పందించారు. ‘‘తైవాన్‌ ఆక్రమణకు సన్నాహాల్లో

Published : 09 Aug 2022 12:45 IST

తైవాన్‌ విదేశాంగశాఖ మంత్రి ఆరోపణ

ఇంటర్నెట్‌డెస్క్‌: తైవాన్‌ సమీపంలో చైనా యుద్ధ విన్యాసాలతో హోరెత్తిస్తోంది. దీనిపై తైవాన్‌ విదేశాంగ శాఖ మంత్రి జోసఫ్‌ వూ తైపేలో జరిగిన ఓ విలేకర్ల సమావేశంలో స్పందించారు. ‘‘తైవాన్‌ ఆక్రమణకు సన్నాహాల్లో భాగంగానే చైనా ఈ విన్యాసాలు నిర్వహిస్తోంది. యథాతథ పరిస్థితిని మార్చడమే బీజింగ్‌ అసలు లక్ష్యం’’ అని ఆరోపించారు. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ పర్యటనను ఓ సాకుగా బీజింగ్‌ వాడుకుంటోందని పేర్కొన్నారు.

మరోవైపు చైనాలోని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఈస్ట్రన్‌ థియేటర్‌ కమాండ్‌ ఓ  ప్రకటన విడుదల చేసింది. తాము తైవాన్‌ సమీపంలో నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాల్లో జాయింట్‌ బ్లాకేడ్‌, జాయింట్‌ సపోర్ట్‌ కార్యకలాపాలపై దృష్టిపెట్టామని పేర్కొంది.

తైవాన్‌ కూడా నిన్న అర్ధరాత్రి సుమారు గంటకు పైగా యుద్ధ విన్యాసాలను చేపట్టింది. ఈ విషయాన్ని ఆ దేశ 8వ కోర్‌ ప్రతినిధి లూవీ-జై పేర్కొన్నారు. ఈ విన్యాసాల్లో తైవాన్‌ శతఘ్నులు, ఫ్లేయర్లను ప్రయోగించింది. మొత్తం 40 శతఘ్నులను ఇందుకోసం వాడింది. చైనా సోమవారం యుద్ధ విన్యాసాలను పొడిగించాక.. తైవాన్‌ యాంటీ ల్యాండింగ్‌ ఎక్సర్‌సైజ్‌లను నిర్వహించింది.

మరోవైపు అమెరికా మాత్రం భిన్నంగా స్పందించింది. చైనా ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలు ఏమీ చేపట్టకపోవచ్చని పేర్కొంది. డోవర్‌ ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ మాట్లాడుతూ ‘‘ నేను చింతించడం లేదు.. కానీ, ఆందోళన చెందుతున్నాను. వారు(చైనా) ఎంత వీలైతే అంత ముందుకెళ్లారు. వారు ఇప్పుడున్న దానికంటే ముందుకెళతారని మాత్రం నేను భావించడంలేదు’’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని