స్వాతంత్ర్యం కోసం ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు: తైవాన్‌కు చైనా హెచ్చరిక

స్వాతంత్ర్యం కోసం తైవాన్‌ ఏమైనా ప్రయత్నాలు చేస్తే కఠిన శిక్ష తప్పదంటూ చైనా హెచ్చరికలు చేసింది.

Published : 14 Jan 2024 21:32 IST

బీజింగ్‌: తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీకి చెందిన లాయ్‌ చింగ్‌-తె (Lai Ching-te) విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన చైనా.. తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స్వాతంత్ర్యం కోసం తైవాన్‌ ఏమైనా ప్రయత్నాలు చేస్తే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించింది. తైవాన్‌ ఎప్పటికీ దేశం కాదని చైనాలో భాగమేనంటూ పాతపాటే పాడింది.

‘తైవాన్‌ ద్వీపంలో ఎవరైనా స్వాతంత్ర్యం కావాలని భావిస్తే, చైనాను విభజించాలని ప్రయత్నిస్తే.. చారిత్రకంగా, చట్టపరంగా కఠిన శిక్షలు తప్పవు. ఇదే చివరిది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా చైనా ఒక్కటే. అందులో తైవాన్‌ భాగమనే వాస్తవాన్ని మార్చలేరు. తైవాన్‌ ఎప్పుడూ ఒక దేశం కాదు. గతంలో, భవిష్యత్తులోనూ ఉండదు’ అని చైనా అత్యున్నత దౌత్యవేత్త వాంగ్‌ యీ హెచ్చరించారు.

తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (DPP)కి చెందిన లాయ్‌ చింగ్‌కు ఓటు వేయొద్దని చైనా ఇదివరకు హెచ్చరికలు చేసింది. వాటిని లెక్కచేయని తైవాన్‌ వాసులు.. లాయ్‌ వైపే మొగ్గుచూపారు. దీనిపై స్పందించిన చైనా తన పునరేకీకరణ ధోరణిలో ఎటువంటి మార్పు ఉండదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని