China: మరోసారి కఠిన ఆంక్షల చట్రంలోకి బీజింగ్‌

చైనా రాజధాని బీజింగ్‌ మరోసారి కఠిన ఆంక్షల పరిధిలోకి వెళ్లింది. జీరో కొవిడ్‌ పాలసీకి అనుగుణంగా ఆదివారం నుంచి మరోసారి నగరంలో లాక్‌డౌన్‌ విధించారు. చైనా ఎన్నిక ఆంక్షలు విధించినా

Published : 23 May 2022 01:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా రాజధాని బీజింగ్‌ మరోసారి కఠిన ఆంక్షల పరిధిలోకి వెళ్లింది. జీరో కొవిడ్‌ పాలసీకి అనుగుణంగా ఆదివారం నుంచి మరోసారి నగరంలో లాక్‌డౌన్‌ విధించారు. చైనా ఎన్ని ఆంక్షలు విధించినా కొత్త ప్రదేశాల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో మరిన్ని నగరాలు లాక్‌డౌన్‌ పరిధిలో వెళుతున్నాయి. హయిడియన్‌, చావోయాంగ్‌,ఫెంతాయ్‌,షన్‌యి, ఫాంగ్‌షాన్‌ జిల్లాలో ఆంక్షలు అమల్లో ఉన్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. 

ఆహారం డెలివరీలు చేసే రెస్టారెంట్లు, ఫార్మసీలు మినహా థియేటర్లు, జిమ్‌లు, షాపింగ్‌ మాల్స్‌ మొత్తం మూసివేశారు. పార్కులను మాత్రం 30శాతం సామర్థ్యంతో నిర్వహించవచ్చని పేర్కొన్నారు. బీజింగ్‌లోని ఈ ఐదు జిల్లాలకు చెందిన ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని అధికారులు ఆదేశించారు. మే 28 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. 

ప్రజలు నిర్లక్ష్యం కారణంగా ముందు జాగ్రత్త చర్యలను గాలికొదిలేయడంతో వ్యాధి వ్యాప్తికి కారణమవుతోందని పేర్కొన్నారు. చైనాలో శనివారం  157కొవిడ్‌ కేసులు నమోదుకాగా.. వీటిలో 52 బీజింగ్‌లోనే వెలుగు చూశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని