Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక

చైనా నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5 శ్రీలంక దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే లంక అధికారులు ఆ నౌక రాకను వాయిదా వేయాలని కోరారు. ఆ మాటలను చైనా వినిపించుకోవడంలేదు. అసలు ఈ నౌకను శ్రీలంకలోని హంబన్‌

Published : 10 Aug 2022 02:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా నిఘా నౌక యువాన్‌ వాంగ్‌-5 శ్రీలంక దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే లంక అధికారులు ఆ నౌక రాకను వాయిదా వేయాలని కోరారు. ఆ మాటలను చైనా వినిపించుకోవడంలేదు. అసలు ఈ నౌకను శ్రీలంకలోని హంబన్‌ టొట రేవులో లంగర్‌ వేసేందుకు తొలుత అనుమతి ఇవ్వడంపైనే భారత్‌ తీవ్రంగా స్పందించింది. దీంతో వెనక్కి తగ్గిన లంక.. యువాన్‌ వాంగ్‌ 5 ప్రయాణం వాయిదా వేయాలని డ్రాగన్‌ను కోరింది. నేటి ఉదయం 10 గంటల సమయంలో ఈ నౌక ఇండోనేషియాకు ఉత్తర దిశగా  గంటకు 26 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ రకంగా అయితే గురువారం ఉదయం 9.30 గంటలకు  హంబన్‌టొట రేవుకు ఇది చేరుకొంటోంది. 

భారత్‌ నుంచి శ్రీలంక అధికారులపై నిన్న తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీంతో వారు నిన్న కూడా చైనా దౌత్య అధికారులను పిలిపించి ఆ నౌక ప్రయాణాన్ని వాయిదా వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో చైనా అధికారులు భారత్‌ పేరు ప్రస్తావించకుండా ఓ ప్రకటన జారీ చేశారు. చైనా పరిశోధక నౌకను సాధారణ దృష్టితో చూడాలని కోరారు. శ్రీలంక-చైనా మధ్య సాధారణ సహకారాన్ని దెబ్బతీయవద్దని కోరారు. 

ఈ యుద్ధ నౌక సాయంతో భారత్‌ క్షిపణి పరీక్షలను చైనా పరిశీలించి సమాచారం సేకరించే అవకాశం లభిస్తుంది. ‘యువాన్‌ వాంగ్‌ 5’ క్షిపణి, అంతరిక్షం, ఉపగ్రహాల ట్రాకింగ్‌ చేయగలదు. 750 కిలోమీటర్లకుపైగా దూరంలోని ప్రాంతాలపై గగనతల నిఘా ఉంచగలదు. కల్పకం, కూడంకుళం సహా అణు పరిశోధన కేంద్రాలు దీని పరిధిలోకి వస్తాయి. దీంతోపాటు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఆరు భారతీయ పోర్టులపై ఈ నౌక నిఘా ఉంచగలదు. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన సంస్థల కీలక సమాచారాన్నీ సేకరించగలదు. 

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని