China: జిన్‌పింగ్‌ సమక్షంలో.. చైనా మాజీ అధ్యక్షుడికి భంగపాటు..!

చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావోకు భంగపాటు ఎదురైంది. ముగింపు దశకు చేరుకున్న కమ్యూనిస్ట్‌ పార్టీ మహాసభల నుంచి ఆయన్ను బయటకు పంపివేశారు. 

Updated : 22 Oct 2022 13:39 IST

బీజింగ్‌: చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ (సీపీసీ) 20వ మహాసభలు నేటితో ముగియనున్నాయి. వారం రోజులుగా జరుగుతున్న ఈ సభల్లో శనివారం డ్రామా చోటుచేసుకుంది. బీజింగ్‌లోని గ్రేట్‌హాల్ ఆఫ్‌ పీపుల్‌ ఆడిటోరియంలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పక్కన కూర్చొని ఉన్న మాజీ అధ్యక్షుడి హు జింటావోను కొందరు సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. హు జింటావో.. జిన్‌పింగ్‌కు ముందు చైనా అధ్యక్షుడిగా వ్యవహరించారు.

79 ఏళ్ల వయస్సులో ఉన్న జింటావో ఈ మహాసభల్లో పాల్గొన్నారు. గత ఆదివారం సభ ప్రారంభ సమయంలో ఆయన స్టేజ్‌పైకి వచ్చినప్పుడు కూడా స్థిమితంగా కనిపించలేదు. అయితే ఈ రోజు ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆయన్ను అనూహ్యంగా బయటకు తీసుకువెళ్లారు. కొందరు సిబ్బంది వెంట ఉండి ఆయన్ను తీసుకెళ్లిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కాగా, మహాసభల సందర్భంగా చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి సీపీసీ ఎన్నుకోనుంది. అయితే, అధ్యక్షుడిగా మూడోసారి జిన్‌పింగ్‌ బాధ్యతలు చేపడుతున్నప్పటికీ.. అది జీవితకాలం ఉండే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు