Taiwan: అలా దాడి చేస్తారా? అయితే మహాపాపం మూటగట్టుకుంటారు..

కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) 20వ మహాసభల్లో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్  చేసిన వ్యాఖ్యలను తైవాన్‌ తప్పుపట్టింది. 

Published : 20 Oct 2022 15:57 IST

తైపీ: అవసరమైతే.. తైవాన్‌ను స్వాధీనం చేసుకునే విషయంలో బలప్రయోగానికి వెనకాడబోమని కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) 20వ మహాసభల్లో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిని తైవాన్ తిప్పికొట్టింది. తమపై దాడి చేస్తే.. చైనా అధ్యక్షుడు పాపిగా మిగులుతారంటూ పేర్కొంది.  

‘తైవాన్‌పై దాడిచేస్తే.. జిన్‌పింగ్‌ గొప్పనేత అనే స్థాయి కోల్పోయి, చైనీయుల్లోనే అత్యంత పాపిగా మిగిలిపోతారు’ అని ఆంగ్ల మీడియా కథనం పేర్కొంది. తైవాన్‌ నేషనల్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ వెల్లడించింది. ‘తైవాన్‌ సార్వభౌమాధికార దేశమని తనకు తానే భావిస్తోంది. కానీ, దాన్ని చైనా మాత్రం విడిపోయిన ప్రావిన్సుగానే చూస్తోంది. పునరేకీకరణ కోసం చిత్తశుద్ధితో శాంతియుతంగా ప్రయత్నిస్తాం. అయినప్పటికీ తైవాన్‌ ఏకీకరణకు బలప్రయోగ అస్త్రాన్నీ విడిచిపెట్టలేము. వేర్పాటువాద శక్తులను అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం’ అని జిన్‌పింగ్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు కొనసాగనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ (CPC) మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి సీపీసీ ఎన్నుకోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని