Chinese Spy Ship: భారత్‌ విజ్ఞప్తులు శ్రీలంక బేఖాతరు.. హంబన్‌టొట చేరిన నిఘా నౌక..!

భారత్‌ ఎంత వారించినప్పటికీ చివరి నిమిషంలో శ్రీలంక అనుమతులు ఇవ్వడంతో చైనా నిఘా ‘యువాన్‌ వాంగ్‌-5’ నేటి ఉదయం 8.30 సమయంలో హంబన్‌టొట రేవుకు చేరుకొంది.

Updated : 16 Aug 2022 11:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌ ఎంత వారించినప్పటికీ చివరి నిమిషంలో శ్రీలంక అనుమతులు ఇవ్వడంతో చైనా నిఘా ‘యువాన్‌ వాంగ్‌-5’ నేటి ఉదయం 8.30 సమయంలో హంబన్‌టొట రేవుకు చేరుకొంది. ఈ విషయాన్ని రేవులోని హార్బర్‌ మాస్టర్‌ కెప్టెన్‌ నిర్మల్‌ డిసెల్వ ధ్రువీకరించారు. ఈ నౌక రాకను కొన్ని వారాల ముందే పసిగట్టిన భారత్‌ తక్షణమే స్పందించి శ్రీలంకకు అభ్యంతరాలను తెలియజేసింది. దీనిపై స్పందించిన లంక అధికారులు యువాన్‌ వాంగ్‌-5 ప్రయాణాన్ని వాయిదా వేయాలని చైనా అధికారులను కోరారు. 

శ్రీలంక సూచన మేరకు ఈ ప్రయాణం వాయిదా పడినట్లు ప్రచారం జరిగినా..గత వారం యువాన్‌ వాంగ్‌ హంబన్‌టొట దిశగా 1,000 కిలోమీటర్ల దూరంలో కదులుతున్నట్లు గుర్తించారు. ఈ నౌక ప్రయాణాన్ని ఎందుకు వాయిదా వేయాలంటూ చైనా అధికారులు లంక అధికారులను ప్రశ్నించడంతో.. వారు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఫలితంగా నౌకకు శనివారం లంక అనుమతి మంజూరు చేసింది. 

ఈ నౌక  శ్రీలంక జలాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ను ఆఫ్‌ చేయాలనే నిబంధనపై అనుమతి ఇచ్చినట్లు కొలంబో అధికారులు చెబుతున్నారు. లంక జలాల్లో ఎటువంటి సర్వేలు నిర్వహించడానికి అనుమతించమని పేర్కొన్నారు. ఆగస్టు 16-22 మధ్యలో కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. ‘యవాన్‌ వాంగ్‌-5 విషయంలో మా పొరుగు దేశాలతో భద్రత, సహకారం తమ అత్యున్నత  ప్రాధాన్యం ఇస్తాము. ప్రతి దేశం సార్వభౌమత్వం సమానమే అనే సూత్రానికి అనుగుణంగా అన్ని పక్షాల ప్రయోజనాలు, ఆందోళనను పరిగణనలోకి తీసుకొంటాము’ అని శ్రీలంక విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. హంబన్‌టొట అభివృద్ధికి చైనా 1.2 బిలియన్‌  డాలర్ల రుణాన్ని ఇచ్చింది. శ్రీలంక ఆ రుణం చెల్లించలేకపోవడంతో ఈ పోర్టును 99 సంవత్సరాల లీజుకు బీజింగ్‌ తీసుకొంది.


Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని