The Square Kilometre Array: ప్రపంచంలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం షురూ
విశ్వంపై దృష్టిపెట్టేందుకు అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం మొదలైంది. నేడు ఆస్ట్రేలియాలో దీనిని ఆరంభించారు.
ఇంటర్నెట్‌డెస్క్: 21వ శతాబ్దంలో అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకదాని నిర్మాణం ప్రారంభమైంది. ది స్క్వేర్ కిలోమీటర్ ఆర్రే (The Square Kilometre Array )పేరిట అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ఆస్ట్రేలియా(Australia)లో నేడు మొదలుపెట్టారు. దీనిని 2028 నాటికి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. దీని నిర్మాణం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో చేపట్టారు. ప్రధాన కార్యాలయం మాత్రం యూకేలో ఉంటుంది. ఖగోళంలో చాలా మిస్టరీలపై పరిశోధనలకు దీనిని వినియోగించనున్నారు. ఐన్‌స్టీన్ సిద్ధాంతాలపై కూడా పరిశోధనలు చేయనుంది. భూగోళం వంటి గ్రహాలు మరేమైనా ఉన్నాయేమో అన్న అంశంపై కూడా శోధించనుంది. నేడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఆస్ట్రేలియాలోని మార్చిసన్ ప్రాంతంలో 74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో క్రిస్మస్ చెట్లు వంటి దాదాపు 1,00,000 పైగా యాంటెన్నాలను నిర్మించనున్నారు.
ఎస్కేఏ (SKA) లాసైట్ ప్రాజెక్టు నిర్మాణ డైరెక్టర్ ఆంటోనీ షింకెల్ మాట్లాడుతూ తొలిసారి ఇటువంటి టెలిస్కోప్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా రేడియో, ఆప్టికల్ టెలిస్కోప్‌లు ఉన్నా.. దీంతో వాటిని పోల్చలేమని ఆయన పేర్కొన్నారు. దీని నిర్మాణానికి సంబంధించిన ఆలోచన 1990ల్లో వచ్చిందని ఆయన వివరించారు. 2003లో ఈ ప్రాజెక్టుపై పనిచేయడం మొదలుపెట్టామన్నారు. బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వనిర్మాణం తొలినాళ్లలోకి చూడటానికి భారీ టెలిస్కోప్ అవసరమన్నారు. ఈ టెలిస్కోప్ నిర్మాణ పనులు వచ్చే ఏడాది నుంచి చురుగ్గా జరుగుతాయని భావిస్తున్నారు. 2028 నాటికి ఈ పనులు పూర్తవుతాయని అంచనావేశారు. అదే సమయంలో దక్షిణాఫ్రికా(South Africa )లో 197 భారీ డిష్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటి మొత్తాన్ని కలిపితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టులో 16 దేశాలు కలిసి పనిచేస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. తెదేపా మండలాధ్యక్షుడికి గాయాలు
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!
-
Movies News
Mukhachitram: విశ్వక్సేన్ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Movies News
Social Look: సిల్క్‌స్మితలా దివి పోజు.. మేఘ ‘ప్రేమదేశం’ అప్పుడే