paris violence: రణరంగంగా మారిన ప్యారిస్‌..!

ప్యారిస్‌లో శుక్రవారం చోటు చేసుకొన్న కాల్పులు తీవ్ర హింసకు దారి తీశాయి. ఈ హింసలు 30 మంది వరకు గాయపడ్డారు. 

Published : 26 Dec 2022 18:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌ హింసాత్మక ఘటనలతో రణరంగాన్ని తలపించింది. ప్యారిస్‌లో శుక్రవారం కుర్దు ప్రజలపై జరిగిన కాల్పుల ఘటన తీవ్రమైన హింసకు దారితీసింది. ఈ దాడిలో ముగ్గురు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు వాటికి నిప్పు పెట్టారు. ప్యారిస్‌లో ఆందోళనలకు వేదికగా నిలిచే రిపబ్లిక్‌ స్క్వేర్‌ వద్ద పలు షాపులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు ఆందోళనకారులపై టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. దాదాపు 30 మంది పోలీసులు, ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు రెండు గంటలపాటు ప్యారిస్‌ ఘర్షణలతో ఉద్రిక్తంగా మారింది. 

సాయుధుడి అరెస్టు..

ప్యారిస్‌లోని 10వ డిస్ట్రిక్ట్‌లో శుక్రవారం ఒక సాయుధుడు కేఫ్‌లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. 10ఏళ్ల క్రితం జరిగిన ముగ్గురు కుర్దుల హత్యపై ఓ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా ఈ కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు కుర్దులు మరణించారు. ఈ ఘటనలో ఓ అనుమానితుడిని ప్యారిస్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఇంటరాగేషన్‌ చేయగా.. విదేశీయులను ద్వేషిస్తానని అంగీకరించాడు. అనుమానితుడు పేరు విలియంగా గుర్తించారు. అతడిని ఒక మానసిక చికిత్సాలయంలో ఉంచి విచారిస్తున్నారు. అతడు 2016లో దోపిడీకి గురైనప్పటి నుంచి పూర్తిగా మానసిక కుంగుబాటులో ఉన్నట్లు  గుర్తించారు. నాటి నుంచి అతడు విదేశీయులను ద్వేషించడం మొదలుపెట్టినట్లు ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. తొలుత అతడు కాల్పులు జరిపేందుకు వలసదారులు ఎక్కువగా ఉండే శివార్ల ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ జనం తక్కువగా ఉండటంతో వెనక్కి వచ్చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత పారిస్‌ 10వ డిస్ట్రిక్ట్‌ వద్దకు వెళ్లి దాడి చేసి ముగ్గురిని చంపేశాడు. అతడిపై హత్యా, హత్యాయత్నం నేరాలు మోపి అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని