Covid-19 : న్యూయార్క్‌లో పెరుగుతోన్న కొవిడ్‌ కేసులు

గత కొద్ది వారాలుగా న్యూయార్క్‌లో పెరుగుతున్న కొవిడ్‌ కేసుల దృష్ట్యా నిబంధనలను కఠినం చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మధ్యస్థంగా ఉన్ననిబంధనలను పెంచుతూ న్యూయార్క్‌ వాసులను హెచ్చరించారు.

Updated : 18 May 2022 14:11 IST

న్యూయార్క్: న్యూయార్క్‌లో గత కొద్ది వారాలుగా మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో నిబంధనలను కఠినం చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్‌ అలర్ట్‌ స్థాయిని ‘మీడియం’ నుంచి ‘హై’కి పెంచుతూ న్యూయార్క్‌ వాసులను హెచ్చరించారు. వైరస్‌ సామాజిక వ్యాప్తి అధికంగా ఉండటంతోపాటు  ఆరోగ్య సంరక్షణా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందని  అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నగర వాసులు కరోనా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని నగర ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ అశ్విన్ వాసన్ సూచించారు.

ఏప్రిల్ ప్రారంభం నుంచి అమెరికాలో రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ మహమ్మారి సోకి మరణించిన వారి సంఖ్య  1 మిలియన్‌ దాటింది. న్యూయార్క్‌లో మే నెల ఆరంభంలో కొవిడ్‌ అలర్ట్‌ను తక్కువ స్థాయి నుంచి మీడియానికి పెంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని