Corona Deaths: 40శాతం పెరిగిన కొవిడ్‌ మరణాలు, కానీ..: డబ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచవ్యాప్తంగా గతవారం కొవిడ్‌ మరణాల సంఖ్య 40 శాతానికి పైగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. అయితే అమెరికాలో మరణాల

Published : 31 Mar 2022 01:16 IST

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా గతవారం కొవిడ్‌ మరణాల సంఖ్య 40 శాతానికి పైగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. అయితే అమెరికాలో మరణాల నమోదు ప్రక్రియలో చోటుచేసుకున్న మార్పులు, భారత్‌ వంటి దేశాల్లో లెక్కల్లో సవరణ కారణంగానే ఈ సంఖ్య పెరిగినట్లు తెలిపింది. మరోవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పడం ఊరటనిస్తోంది. 

గత వారం ప్రపంచవ్యాప్తంగా 45వేల కరోనా మరణాలు నమోదయ్యాయి. అంతక్రితం వారం మరణాల సంఖ్య 23 శాతం తగ్గగా.. గతవారం మాత్రం 40 శాతం పెరగడం గమనార్హం. భారత్‌లో కొన్ని రాష్ట్రాలు ఇటీవల మరణాల సంఖ్యను సవరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరణాల సంఖ్య పెరిగినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. కాగా.. గతవారం దాదాపు 10 మిలియన్ల కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 

ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోటా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. అయితే ఈ గణాంకాలతో వైరస్‌ అంతమవుతుందని అంచనాకు రాలేమని తెలిపింది. చాలా దేశాలు కరోనా నిబంధనలను ఎత్తివేయడంతో పాటు పరీక్షలను కూడా తగ్గించిన విషయాన్ని ప్రస్తావించింది. అందువల్ల వైరస్‌ వ్యాప్తి ఎలా ఉందనేది కచ్చితంగా తెలియడం లేదని అభిప్రాయపడింది. అయితే కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలో వైరస్‌ను తక్కువగా అంచనా వేయొద్దని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది. కొవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలను కొనసాగించాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని