Bangladesh: భారత్‌లోని వ్యభిచార గృహానికి బాలిక విక్రయం.. బంగ్లాదేశీ జంటకు మరణ దండన

ఉపాధి పేరుతో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలిక(17)ను ఓ జంట వ్యభిచార గృహానికి తరలించిన కేసులో అక్కడి ట్రిబ్యునల్‌ మరణ శిక్ష విధించింది.

Published : 19 May 2022 00:35 IST

ఢాకా: ఉపాధి పేరుతో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ బాలిక(17)ను ఓ జంట వ్యభిచార గృహానికి తరలించిన కేసులో అక్కడి ట్రిబ్యునల్‌ మరణ శిక్ష విధించింది. షహీన్‌ షేక్‌, ఆస్మా బేగమ్‌ దంపతులను దోషులుగా తేలుస్తూ ఖుల్నా మహిళ, బాలిక అణచివేత నియంత్రణ ట్రిబ్యునల్ ఈ తీర్పు వెలువరించింది. బంగ్లాదేశ్‌ న్యూస్‌ ఏజెన్సీ యూఎన్‌బీ నివేదిక ప్రకారం.. దేశంలోని ఖుల్నా ప్రాంతానికి చెందిన ఓ బాలికను 2009 అక్టోబర్‌ 19 షహీన్‌ షేక్‌ దంపతులు ఉపాధి పేరుతో మభ్యపెట్టి భారత్‌లోని ఓ వ్యభిచార గృహానికి విక్రయించారు. అయితే కొద్దిరోజుల తర్వాత తమ కుమార్తె ఆచూకీపై తల్లిదండ్రులు ప్రశ్నించగా ఆ దంపతులు పొంతనలేని సమాధానాలు చెప్పారు. బాలికను తిరిగి రప్పించేందుకు వారి నుంచి 20వేల బంగ్లా టాకాలను సైతం డిమాండ్‌ చేశారు. దీంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరిపిన పోలీసులు 2010 జనవరి 10న చార్జ్‌షీట్‌ను సమర్పించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన ట్రిబ్యునల్‌ దంపతులకు మరణదండన విధించినట్లు యూఎన్‌బీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని