Deltacron: యూకేలో డెల్టాక్రాన్..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉనికి చాటుతూనే ఉంది. కొత్త మార్పులు చేసుకుంటూ దశల వారీగా ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం డెల్టాక్రాన్ గురించి చర్చ నడుస్తోంది.
కొవిడ్ పాజిటివ్ నమూనాల్లో గుర్తింపు
లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉనికి చాటుతూనే ఉంది. కొత్త మార్పులు చేసుకుంటూ దశల వారీగా ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం డెల్టాక్రాన్ గురించి చర్చ నడుస్తోంది. ఈ హైబ్రిడ్ వేరియంట్ డెల్టా, ఒమిక్రాన్ లక్షణాలను ప్రదర్శిస్తోంది. యూకేలో కొవిడ్ పాజిటివ్ నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. ఈ డెల్టాక్రాన్ లక్షణాలను గుర్తించారు. ఈ విషయాన్ని అక్కడి హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(హెచ్ఎస్ఏ) వెల్లడించింది.
ఈ హైబ్రిడ్ వేరియంట్ బారినపడిన వ్యక్తుల్ని గుర్తించిన తర్వాత ఆ వేరియంట్‌ను పర్యవేక్షిస్తామని హెచ్ఎస్ఏ అధికారులు తెలిపారు. ఈ డెల్టాక్రాన్ వ్యాప్తి, తీవ్రత గురించి వారి నుంచి అధికారిక స్పందన రాలేదు. మొదట ఈ వేరియంట్‌ను ఐరోపా దేశం సైప్రస్‌లో గుర్తించారు. అయితే పలు ప్రముఖ కథనాలు దీన్ని ల్యాబ్ ఎర్రర్ అంటూ తోసిపుచ్చాయి. అయితే దీనిని గుర్తించిన పరిశోధకుడు మాత్రం తన వాదనను సమర్థించుకున్నారు. ఈ డెల్టాక్రాన్.. డెల్టా, ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్