Ukraine Crisis: ‘ఆర్థిక యుద్ధాలన్నీ వాస్తవరూపం దాల్చాయని మర్చిపోకు’

ఉక్రెయిన్‌పై దాడులు పెరుగుతున్నా కొద్దీ ప్రపంచ నేతల మధ్య మాటల యుద్ధం కూడా ఊపందుకుంది. ఫ్రాన్స్ ఆర్థిక మంత్రిని ఉద్దేశించి రష్యా మాజీ అధ్యక్షుడు......

Published : 01 Mar 2022 23:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై దాడికి తెగబడ్డ రష్యాపై ప్రపంచ దేశాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడులు పెరుగుతున్నా కొద్దీ ప్రపంచ నేతల మధ్య మాటల యుద్ధం కూడా ఊపందుకుంది. ఫ్రాన్స్ ఆర్థిక మంత్రిని ఉద్దేశించి రష్యా మాజీ అధ్యక్షుడు, ఆ దేశ భద్రతా మండలి డిప్యూటీ హెడ్‌ దిమిత్రి మెద్వెదేవ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమతో పెట్టుకుంటే యుద్ధం తప్పదని హెచ్చరించారు. ‘రష్యాపై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తామని ఈ రోజు ఓ ఫ్రాన్స్‌ మంత్రి అన్నారు. జెంటిల్‌మెన్‌.. నోరు అదుపులో పెట్టుకో. మానవ చరిత్రలో ఆర్థిక యుద్ధాలన్నీ వాస్తవరూపం దాల్చాయని మర్చిపోకు’ అంటూ మెద్వెదెవ్‌ ట్వీట్‌ చేశారు.

ఓ ఫ్రెంచ్‌ మీడియా సంస్థతో  ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రునో లె మైరై సోమవారం మాట్లాడుతూ.. ‘రష్యా ఆర్థిక వ్యవస్థ పతనానికి దారితీస్తాము’ అని పేర్కొన్నారు. తీసుకునే నిర్ణయాల ప్రభావంతో సాధారణ రష్యన్లు కూడా బాధపడే అవకాశం ఉందన్న బ్రునో.. దీన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామన్నారు. బ్రునో మాటలను ఉటంకిస్తూ దిమిత్రి మెద్వెదెవ్‌ తాజా వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని