ఇంట్లో మంట పెట్టిన పెంపుడు శునకం.. ‘యాపిల్‌’ అలర్ట్‌తో ఫ్యామిలీ సేఫ్‌!

పెంపుడు శునకం పొరబాటున గ్యాస్‌ స్టావ్‌ను ఆన్‌ చేయడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. నివాసంలోని ‘యాపిల్‌ పాడ్‌’ అలర్ట్‌తో గాఢ నిద్రలో ఉన్న యజమానులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. 

Published : 09 Jul 2024 17:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంట్లో పెంపుడు జంతువులు చేసే పనులకు కొన్నిసార్లు విలువైన వస్తువులు పాడైపోవడాన్ని చూస్తుంటాం. కానీ, ఓ శునకం మాత్రం ఏకంగా ఇంటి మొత్తాన్ని తగలబెట్టేంత పని చేసింది. వంటగదిలోకి వెళ్లి గ్యాస్‌ స్టవ్‌ను ‘ఆన్‌’ చేసింది. దీంతో మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లోని ‘యాపిల్‌ పాడ్‌’ అలర్ట్‌తో గాఢనిద్రలో ఉన్న యజమానులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన అమెరికా (USA)లో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే..

కొలరాడోకు చెందిన ఓ కుటుంబం.. ఓ శునకాన్ని పెంచుకుంటోంది. ఓ రాత్రి యజమానులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఆ శునకం ఇల్లంతా తిరిగింది. ఈ క్రమంలోనే వంటగదిలోకి వెళ్లి గ్యాస్‌ స్టవ్‌పై రెండు కాళ్లు వేసింది. పొరబాటున ఆన్‌ కావడంతో పక్కనున్న వస్తువులకూ మంటలు వ్యాపించాయి. అలా ఇల్లంతా పొగతో నిండిపోయింది. అప్పటికీ యజమానులు నిద్రలేవలేదు. వారి ఇంట్లో ఉన్న ‘యాపిల్‌ హోమ్‌ పాడ్‌ అలారం’ మోగింది. ఆ శబ్దానికి మేల్కొన్న యజమాని భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

పర్వతారోహణకు వెళ్లి అదృశ్యం..22 ఏళ్ల తర్వాత చెక్కుచెదరని స్థితిలో మృతదేహం లభ్యం

ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులను ఆస్పత్రికి తరలించారు. శునకం చర్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘అందుకే.. శునకాలను ఒంటరిగా వదిలేయకూడదు. లేకుంటే ఇలాగే ఇంటిని తగలబెట్టేస్తాయి’’ అని ఒకరు.. ‘‘ఈ అలారంతో పెను ప్రమాదం తప్పింది. ఇది ప్రతి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు గుప్పించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని