Truth Social: ట్రంప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’కు భారీ డిమాండ్‌.. యాపిల్‌ స్టోర్‌లో 1st ప్లేస్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా యాప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఆదివారం అర్ధరాత్రి యాపిల్‌ యాప్‌ స్టోర్‌లోకి అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్‌......

Published : 23 Feb 2022 01:28 IST

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా యాప్‌ ‘ట్రూత్‌ సోషల్‌’కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఆదివారం అర్ధరాత్రి యాపిల్‌ యాప్‌ స్టోర్‌లోకి అందుబాటులోకి వచ్చిన ఈ అప్లికేషన్‌.. సోమవారం ఉదయానికి స్టోర్ టాప్ చార్ట్‌లో మొదటి స్థానానికి చేరుకోవడం విశేషం. వినియోగదారుల తాకిడి ఎక్కువగా ఉండటంతో.. డౌన్‌లోడ్‌, వివరాల నమోదు, అకౌంట్‌ క్రియేట్‌, సైనప్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయనంటూ పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. సైన్ అప్ చేసిన తర్వాత వెయిట్‌ లిస్ట్‌లో ఉంచినట్లు స్క్రీన్‌పై మెసేజ్‌ కనిపిస్తోందని చెబుతున్నారు. ప్రీఆర్డర్ చేసుకున్నవారికి ఈ యాప్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయింది.

గతేడాది జనవరి 6న కేపిటల్‌ హిల్‌ దాడుల తర్వాత.. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమ సంస్థలు డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాలను నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో తానే స్వయంగా సోషల్‌ మీడియా వేదికను ఏర్పాటు చేసుకుంటానని ట్రంప్‌ ప్రకటించారు. తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ‘ట్రూత్‌ యాప్‌’ను రిపబ్లికన్‌ మాజీ ప్రతినిధి డేవిన్‌ న్యూన్స్‌ ఆధ్వర్యంలోని ట్రంప్‌ మీడియా & టెక్నాలజీ గ్రూప్‌ రూపొందించింది.

ట్విటర్‌ను పోలి ఉండే ఈ యాప్‌లోనూ ఒకరినొకరు ఫాలో చేయొచ్చు. ట్రెండింగ్‌లో ఉన్న విషయాలు తెలుసుకోవచ్చు. సాధారణంగా ట్విటర్‌లో పోస్ట్‌ చేసేవాటిని ట్వీట్‌ అంటాం. ట్రూత్‌ సోషల్ మీడియా యాప్‌లో మాత్రం ‘ట్రూత్‌’ అని సంబోధిస్తారు. ఫిబ్రవరి 21న అధికారికంగా విడుదల చేశారు. మార్చి చివరి నాటికి కనీసం అమెరికాలోనైనా యాప్‌ ద్వారా పూర్తి స్థాయి సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డెవిన్ నూన్స్ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని